తుమ్మల వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి, మాజీ మంత్రి తమ్మల నాగేశ్వరరావు వాహనాన్ని బుధవారం రాత్రి ఖమ్మం నగరంలో పోలీసులు తనీఖీ చేశారు.
రఘునాథపాలెం మండలంలో ప్రచారం ముగించుకుని తిరిగి ఖమ్మంలోని తన నివాసానికి వస్తున్న క్రమంలో తుమ్మల కారును ఖానాపురం సాగర్ కాలువ వద్ద ఉన్న చెక్ పోస్ట్ సిబ్బంది,
ఎన్నికల అధికారులు, పోలీసులు ఆపి తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి నగదు పట్టుబడలేదు.