రేషన్ బియ్యం వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు…
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ బియ్యం పంపిణీ లో కొన్ని రోజులుగా సరైన విధానం అమలు జరగడం లేదనే ఆరోపణలు వచ్చాయి…
రేషన్ బియ్యం సప్లై చేస్తున్న ఎండియు వాహనాలకు జిపిఎస్ అమర్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది…
కొన్నిచోట్ల ఇంటి ముందు వాహనాలు ఆపి రేషన్ బియ్యం ఇవ్వడం లేదు…
ఇకనుంచి లబ్ధిదారులు ఇంటి ముందు వాహనం ఆపి రేషన్ బియ్యం మంజూరు చేయాలని నిర్దేశించిన మార్గాల్లో వాహనం వెళ్తుందా లేదా అని చెక్ చేయడానికి…
జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో గ్రామ వార్డు సచివాలయంలో సిబ్బంది తనిఖీ లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.