రైతులకు 24 గంటలు నాణ్యమైన ఫ్రీ కరెంటు అందిస్తున్నాం: సీఎం కేసీఆర్
తాండూరు: కాంగ్రెస్ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్లు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు కట్టుకున్నాం. మైనర్ ఇరిగేషన్ కింద ఎన్నో చెరువులు మంచిగా చేసుకున్నాం.
భూగర్భ జలాలు పెరిగాయి. ఇదంతా మీ కండ్ల ముందే ఉంది. నేనేక్కడిదో అమెరికా కథ చెప్పట్లేదు. మీ తాండూరు కథనే చెప్తున్నా అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తాండూరు నియోజకవర్గంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో పోల్చిచూడాలి. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. కనీసం మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వలేదు.
తాండూరు ప్రజలు కాగ్నా నది వద్ద గుంతలు తీసి వడకట్టుకొని నీళ్లు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. కానీ ఈ రోజు మిషన్ భగీరథతో ప్రతి తండాలో, చిన్న ఊరులో కూడా పరిశుద్ధమైన నీరును సరఫరా చేస్తోంది.
మంచినీళ్లు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పాలనలో. పదేండ్ల కాలంలో మారుమూల తండాలకు మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాం అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంట్ లేదు..
తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంట్ లేదు, సాగు, మంచినీళ్లు లేవు. ప్రజలంతా బతుకపోవుడు. అర్థరాత్రి కరెంట్ కోసం పోయి తాండూరులో 40 మంది రైతులు షాకులతో, పాములు కరిచి చనిపోయారు.
ఇవన్నీ మీరు ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆర్థికనిపుణులతో చర్చించి ఒక లైన్ తీసుకున్నాం.పేదల సంక్షేమాన్ని ముందు తీసుకున్నాం.
రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలు చేశాం. కంటి వెలుగు ద్వారా కండ్లద్దాలు పంపిణీ చేశారు. గర్భిణుల కోసం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి కార్యక్రమాలు అమలు చేశాం అని కేసీఆర్ తెలిపారు.
రైతులు చల్లగా ఉంటేనే దేశం బాగుంటది..
సంక్షేమం తర్వాత వ్యవసాయ రంగం తీసుకున్నాం. వ్యవసాయం బాగుంటే, రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటది. ప్రాజెక్టుల కింద నీళ్లు పారుతే ఇతర రాష్ట్రాల్లో పన్నులు వసూళ్లు చేస్తరు. మేం నీటి తిరువా రద్దు చేశాం.
మేలైన విద్యుత్ 24 గంటలు ఫ్రీ ఇస్తున్నాం. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్. అదృష్టం బాగాలేక రైతు ఎవరైనా చనిపోతే దినవారం లోపే 5 లక్షల బీమా ఇస్తున్నాం.
7500కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొంటున్నాం. ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ రైతులు బాగుండాలని మద్ధతు ధరకు కొంటున్నాం. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకు ఖాతాలో వేస్తున్నామని కేసీఆర్