పోడు రైతులకు తెలంగాణ హై కోర్టులో ఊరట ప్రిన్సిపల్ సెక్రటరీ సహా జిల్లాలో పలువురు అధికారులకు షోకాజులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (సి.కే న్యూస్) నవంబర్ 23 : తాము సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు 34 మంది దుమ్ముగూడెం మండలం జెడ్. వీరభద్రాపురానికి చెందిన పోడు రైతులు. పాతికేళ్లుగా పొడు భూముల్లో సాగు చేసుకుంటున్నా ఇంకా పట్టాలు మంజూరు కాలేదని హై కోర్టులో మొర పెట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు …

పోడు రైతులకు తెలంగాణ హై కోర్టులో ఊరట

ప్రిన్సిపల్ సెక్రటరీ సహా జిల్లాలో పలువురు అధికారులకు షోకాజులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (సి.కే న్యూస్) నవంబర్ 23 : తాము సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు 34 మంది దుమ్ముగూడెం మండలం జెడ్. వీరభద్రాపురానికి చెందిన పోడు రైతులు.

పాతికేళ్లుగా పొడు భూముల్లో సాగు చేసుకుంటున్నా ఇంకా పట్టాలు మంజూరు కాలేదని హై కోర్టులో మొర పెట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు రశీదులు ఇచ్చినా ఇంకా పట్టాలు రాకపోవడం భద్రాచలం ఐ.టి.డి.ఏ లో నాలుగేళ్ల క్రితం పెట్టిన విన్నపాలు కనీసం పట్టించుకోక పోవడంతో రైతులు నేరుగా హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ప్రజా ప్రతినిధుల అధికారుల నిర్లక్ష్యం వలన అసలు సాగులో లేని వారికి కూడా మండలం లో కొంతమందికి పొడు పట్టాలు పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ పంచాయతీ సెక్రటరీలు ఇచ్చిన పోడు రశీదులు చెల్లవని గమనార్హం. అయితే దీనికి స్పందించిన హై కోర్టు పోడు రైతులకు అనుకూలంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

2019 లో ఐ.టి.డి.ఏ పి.ఓ కు దరఖాస్తు చేసినా ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని పంచాయతీ కార్యదర్శులు ఇచ్చిన రశీదులు చెళ్ళనప్పుడు వారికి అధికారం ఎలా సంక్రమించిందని హై కోర్ట్ ప్రశ్నించింది.

34 మంది పోడు రైతులు 2019 లో పెట్టుకున్న దరఖాస్తుల పరిస్థితిపై జిల్లాకు చెందిన అంతర్జాతీయ మానవ హక్కులు మరియు నేర నిరోధక సభ్యుడైన గంగాధర కిశోర్ కుమార్ ఐ.టి.డి.ఏ కార్యాలయంలో దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని హై కోర్టు ప్రశ్నించింది.

రైతులకు పట్టాలు మంజూరు చేయడంలో జరిగిన జాప్యానికి వివరణ ఇవ్వాలంటూ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్,భద్రాచలం ఐ.టి డి.ఏ పి. ఓ, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, దుమ్ముగూడెం తహశీల్దార్, పంచాయతీ కార్యదర్శి మరియు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ హౌస్ అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేసింది.

తదుపరి ఈ కేసును వచ్చే నెలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ముప్పై నాలుగు మంది పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి ఎవరూ ప్రవేశించరాదని సూచించింది.

కాగా త్వరలోనే 34 మంది రైతుల సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయమై వాస్తవ పరిస్థితులు విచారించి తెలియజేస్తామని ప్రభుత్వ న్యాయవాది హై కోర్టుకు నివేదించారు.

Updated On 23 Nov 2023 10:12 PM IST
cknews1122

cknews1122

Next Story