భారత్ బచావో తెలంగాణ రాష్ట్ర కమిటి “
సిరా చుక్కా మౌనం వహిస్తే- సారా చుక్కా రాజ్యమేలుతుంది” “మేధావులు మౌనం వహిస్తే-మూర్ఖులు రాజ్యమేలుతారు”
భూస్వామ్య అహంకారంతో ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బిఆర్ఎస్, దానికి వెన్నుదన్నుగా నిలబడుతున్న ఫాసిస్టు బిజెపి, రహస్య మిత్రుడైన యంబయం.ల కూటమిని ఓడిద్దాం.
తెలంగాణ ప్రజలారా!
11 పందాల సాధనకై తెలంగాణ సమాజం ప్రభుత్వాల నిర్భంధాలను ఎదిరించి, భారీల దెబ్బలు తిని, జైలు జీవితాలు గడుపుతూ సుమారు 13 తెలంగాణ సమాజం ప్రభుత్వం నిర్భందాలను ఎదిరింది, నిధులు, నియామాకాలలో వలసాంద్ర కల్వకుంట్ల చంద్రశేఖర్ రావురని, బంగారు తెలంగాణను నిర్మించుకు కొన్ని సాధించుడు చేస్తూ కుమ్ములలికినారు నేటి మన ముఖ్య మం మంత్రి, తన చంద్రశేకర్ రావు గారు, నిరసనలను తెలిపే స్వేచ్ఛ లేకుండా చేస్తూ, కను పోలీసు సహారాచే దిగ్బంధం చేస్తూ ముఖు అదుపులోకి ఈమారుడు కెటిఆర్ పర్యటనల సందర్భంగా సదయ్య దత్త్వా దర్భాతాజా ప్రతిపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకల్పము ద్రోహులను అందలపై రాత్రిన పాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ యున్న, త్యాగాలను మరచి తైలం ఉద్యమంను అందలమెక్కించడం, గర్తనీయం, ఉద్యమకారులపైగాణ యువ, నిరుద్యోగ, ఉద్యముకారుం శాలకుల వంచన వేరి ఉద్యమంను నీరు గార్చిన ద్రోహులు నేడు ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యులైనారు.
ప్రజలకు ఇచ్చిన హమీలను నేరవేర్చకుండా, ప్రశ్నించే ప్రజలపై నిర్భంధాన్ని అమానుషమైన “ఉపో” లాంటి చట్టాలను ప్రయోగించి వారి ప్రజాస్వామిక వాచ్చిన హమీలను పులులపై చర్చించడానికి ప్రతిపక్ష పార్టీల, ప్రజా సంఘాలు, దళితబండు, స్వీకరించకుండా అవమానపరుస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి వాహనః నిరుద్యోగర్భతి, కెజి టూ పిజి వరకు ఉచిత విద్య నడువబందుల మూడు ఎకరాల భూమి సంపకం, ముస్లిం డిక్లరేషన్, అపుంటుల పోడు ధుర్కోలు పట్టాలు, పేదరిక నిర్మూలన, ఉచిత వైద్య, నరం పూర్తిత లాంటి వాగ్దానాలు అమలు కాకపోవడం ఇందుకు నిదర్శనం, సామాజిక న్యాయంకు, సమానత్వ భావనకు దొరగారి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుచున్నది. యువకులు మద్యం ప్రియులైతే ఆలోచించే శక్తి కోల్పోతారు. మత్తులో ముంచడమే -లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాని ఫలితంగా హఠ్యాచారాలు, మహిళలపై హింస, అకాల మరణాలు, నేరాలు, పెరిగిపోతున్నాయి. బి.ఆర్.ఎస్. ప్రభుత్వంలో అవినీతి విలయతాండవం చేస్తున్నది. ఏకపక్ష నిర్ణయాలతో కమీషన్ల కోసం తప్పుడు డిజైన్ చేసిన కాళేశ్వరం లీఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లక్ష్యం సాధించకవ ప్రమా చేసుకు గురి అవుతూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చింది. తెలంగాణ సర్ సర్వీస్ కమీషన్ నిర్వహించు పరీక్షల పేవర్ల తరచు కావాలనే లీకేజీలు చేయడం, జరిపిన పరీక్షలు మరల జరపడం, జీవనోనసాధి పొందలేక, కుటుంబ భారం మోయలేక ఆత్మహత్యలకు నిరుద్యోగులు పాల్పడుచున్నారు. ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి భారీ స్థాయిలో జరుగుతున్న అవినీతే ఇందుకు నిదర్శనం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం సన్న, చిన్న కారు రైతులకంటే భూస్వాములకే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. మన రాష్ట్రంలో సుమారు 22 లక్షల కౌలు రైతు కుటుంబాలు ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి, వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల పంట నష్టాలు కోల్పోయి తెచ్చిన అప్పులు తీర్చలేక రుణగ్రస్తులగుచున్నారు. ప్రభుత్వవరంగా వీరికి ఎలాంటి సహాయం అందటంలేదు. వంటల భీమా పథకం లేనందున పంటలు నష్టపోతున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయి బలవంతపు మరణాలకు గురౌతున్నారు.
విద్య, వైద్య రంగాలను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ రంగాలను నిర్వీర్యం చేస్తుంది. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయకపోవడం వలన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ల నియామకాలు లేనందున అనుభం లేని మెడికల్ విద్యార్థులే రోగులకు పెద్ద దిక్కవుతున్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నమని చెప్పుకుంటున్న ప్రభుత్వం డిస్కంలకు 50 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ నుండి నిధులు అందించకపోవడం వలన అప్పుల ఊబిలో బిలో కూరుకపోయాయి, ఐకెపి సెంటర్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతుంది. నాణ్యత పేరుతో మిల్లర్లు, ప్రభుత్వ అధికారులు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ నెలల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల వానలకు, ఎండలకు ధాన్యం పాడైపోతుంది. రైతుల ఖాతాలో సకాలంలో డబ్బులు జమ కావడం లేదు. ధరణి సామాన్య రైతులకు కష్టాలను తెచ్చేదిగా, భూస్వాములకు బంగారు పళ్ళెంగా మారింది.
2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఫాసిస్ట్ విధానాలను అనుసరిస్తూ, ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతూ పాలన సాగిస్తున్నది. నోట్ల రద్దు సిసిఎ, ఎస్ఆర్సి/ ఎన్పిఎల్ వంటి ప్రజా వ్యతిరేక చట్టాలను, గోరక్షణ దాడులు, లవ్ జిహాద్ పేరుతో ముస్లిం ప్రజలపై విద్వేషం రెచ్చగొడుతూ హింసకు పాల్పడుచున్నది. దేశభక్తి పేరుతో వివిధ వర్గాల ప్రజల మధ్య మత సమైక్యత, సమభావనాలను బిజెపి ఫాసిస్టులు నాశనం చేస్తున్నారు. ఇటీవలి మణిపూర్లో మైనార్టీ ‘కూకీ’ గిరిజన ప్రజల మీద జరుగుచున్న దాడులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తూ చేయించిన తీరు ఫాసిస్టు విధానం తప్ప మరేమికాదు. తప్పుడు ప్రచారంతో బ్రహ్మణియ, మనువాద కార్పోరేట్ ఫాసిస్టు భావజాలానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు హామీ కలగానే మిగిలింది. వండిన పంటలకు గిట్టుబాటు ధదలకు చట్టబద్ధత కలిగించే ఉద్దేశం పెన్డిఏ ప్రభుత్వంకు లేదు.. రైతులకు నచ్పిడి అందజేయడం సరైన విధానం కాదని చెప్పే మోడీ గారు బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవాలం పెట్టిన కార్పోరేట్ గద్దలపై జాలిపడి 1.25 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసినారు. ఎన్డీఏ ప్రభుత్వం హాయంలో 10 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను విరోచితంగా రైతులు పోరాటం వెచ్చిన ప్రభుత్వం చట్టాలను తనంతట తాను రద్దు చేసుకున్నది. మోడీ పాలనలో పేదరికం, నిత్యావసర సరుకుల దగ్గర న వర్మిబలికింది. పెరిగినాయి. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమస్య పరిష్కారిస్తామని నమ్మబలికింది. చేస్తే గాని దిగి ఉద్యోగ కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనది. నేటికి మనదేశంలో 28 కోట్ల 2నిరుద్యోగులు జీవనాధారం కోసం ఎదురుచూస్తున్నారు.
సమాజ హితం కోసం ప్రభుత్వ రంగాలన్ని ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటేనే ప్రజల అభివృద్ధి సాధ్యమని సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పుచున్నారు. సంపద సృష్టికి ప్రభుత్వ రంగం వేసే దారులు, కార్మిక వర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలని మోడీ ప్రభుత్వం వ్యతిరేకించడమే కాకుండా పెట్టుబడిదారులే సంపదకు సృష్టికర్తలని వాదికి సాగిలపడుచున్నారు. మోడీ ప్రభుత్వం ఏ రంగాన్ని ప్రైవేటీకరణ నుండి మినహాయింపు ఇవ్వలేదు. పౌర విమానయానం, రైల్వేలు, రేవులు, ఎల్.ఐ.సి., అటవీ ఖనిజ సంపదను ఆదానీ, అంబానీలకు కారు చౌకగా కట్టబెట్టుచున్నారు. వ్యవసాయ రంగంలో ఎరువుల, విత్తనాల పాత్ర కీలకమైనది. ఈ ప్రభుత్వం ఎరువుల పైన, సబ్సిడీలు ఎత్తివేసి, ధరలు పెంచడం వల్ల రైతులకు పెనుభారంగ మారినది. ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంలో ప్రభుత్వాలు విఫలమౌతున్నాయి. ప్రైవేట్ ఎరువుల పరిశ్రమలకే ధరలు నిర్ణయించే అవకాశం ఇవ్వడం వలన వాటి ధరలు విపరీతంగా పెరుగుచున్నాయి.
అంబేద్కర్ సారధ్యంలో రచింపబడిన రాజ్యంగంను రద్దు చేసి సనాతన ధర్మం పేరుతో మనస్మృతి అనే బ్రహ్మణియ రాజ్యాంగాన్ని తీసుకవచ్చే ప్రయత్నంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ సంస్థలు ఆరాటపడుతున్నాయి. మనువాద రాజ్యంగం అమలైతే దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లు, ఆదివాసులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు దేశంలో రెండవ శ్రేణి పౌరులుగా పరిగణిపంపబడుతారు. తిరిగి చాతుర్వర్ణ వ్యవస్థ అమలులోకి వస్తుంది.
రాజ్యాంగ వ్యవస్థలైన ఎలక్షన్ కమీషన్, ఈడి, ఐ.టి. సిబిఐ. ఎన్ఐఏ తదితర సంస్థలను డొల్ల సంస్థలుగా మారుస్తూ తమ ప్రభుత్వానికి లోబడి ఉండేలా చేసుకుంటుంది. తమను వ్యతిరేకించే వారిపైన దాడి చేసే పనిముట్లుగా వాటిని మార్చారు. న్యాయ వ్యవస్థను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ, న్యాయమూర్తులకు వదవీ విరమణ తరువాత ప్రభుత్వ పదవుల ఆశ చూపి వారిని తమకు అనుకూలంగా లోబరుచుకుంటున్నారు. రాష్ట్రాలలో తమను వ్యతిరేకించే ప్రభుత్వాలకు కేంద్రం నిధులు అందకుండా చేస్తూ, ఆ ప్రభుత్వాలను చికాకు పరచి, అస్థిరపరుస్తున్నారు. తమను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను బలహీన పరిచి కూల్చివేస్తున్నారు. సమాఖ్య వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేయిస్తున్నారు.
యంబయం ఏమి చేస్తున్నది.?
ఏ దేశంలోనైనా మెజారీటి మతోన్మాదం చాలా ప్రమాదకరమైనది. మెజారీటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, అది బలపడేలా మైనార్టీ మతోన్మాదం యం.ఐ.యం ద్వారా చేస్తున్నది. ఏ మతోన్మాదం అయినా ప్రజలకు ప్రమాదకరమైనదే. తాను ముస్లింలకు నిజమైన ప్రతినిధినని చెప్పుకుంటూ తనకు ఏ మాత్రం బలం లేని ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలలో బిజెపీతో పోటి పడి అక్కడి ముస్లింలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి మెజార్టీ మతోన్మాదానికి కొండంత బలాన్నిచ్చింది. ఉత్తరప్రదేశ్, బిహార్, మహరాష్ట్ర లలో బిజెపి బలం పెరగడంలో యంబయం పార్టీ కీలక పాత్ర పోషించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలో అలా జరగకుండా యంబయంను అక్కడి ప్రజలు తిరస్కరించారు. తెలంగాణలో నిరంకుశ బిఆర్ఎస్ ప్రభుత్వంతో చెట్టపట్టాలతో ఎన్నికలకు వస్తున్నది. యంబయం ఎన్నికల విధానాన్ని పరిశీలించినట్లయితే ముస్లిం హక్కులను పక్కకు బెట్టి, తమ ఆస్తులను, తమ పదవులను, తమ అవినీతిని కాపాడుకోవడానికి బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు బి-టీంగా వ్యవహరిస్తుంది.
ముగింపు:-
బిఆర్ఎస్, బిజెపి, యంబయంలు ఒకే తాను ముక్కలు, బిఆర్ఎస్ఐ నిరంకుశ విధానమైతే, బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలను అవలంభిస్తుంది. యంబయం ముస్లిం కార్డు చూపుతూ ఈ రెండు పార్టీల అధికారం యధాతథంగా కొనసాగాలని రహస్య ఒప్పందంతో రెండు పార్టీలకు బి-టీం గా వ్యవహారిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం పగలు విమర్శలు, చీకట్లో విందులు చేసుకుంటున్నారు. రాబోవు ఎన్నికలలో మళ్లీ బి.ఆర్.ఎస్. అధికారంలోకి వస్తే పేదవానికి విద్య, వైద్యం, ఉద్యోగం, ఉ సాధి శూన్యం. రాష్ట్రంలో బిఆర్ఎస్. పార్లమెంట్ లో బిజెపి బలం చెదిరిపోకుండా లోపాయకారి ఒప్పందంలో బాగాస్వామ్యమైన యంబయంలు తెలంగాణ ఎన్నికల బరిలోకి వస్తున్నాయి. వీటిని ఓడించడం తెలంగాణ ప్రజల కర్తవ్యం. ప్రజలారా! ప్రశ్నించే శక్తులు, ప్రజాస్వామికవాదులు, రాజ్యంగబద్ధవాదులు, సమానత్వం,సమభావన, ప్రాథమిక హక్కుల రక్షణకై ఆరాటపడే వ్యక్తుల, సంస్థలతో చేతులు కలిపి నిరంకుశ బిఆర్ఎస్, ఫాసిస్టు బిజెపి ఈ రెండు పార్టీలకు బి-టీం గా ఉన్న యంబయం పార్టీలను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
“కొద్దిమంది మేధావులు నిబద్ధతతో, బాధ్యతతో పనిచేసిన వాళ్ళే ఇప్పటి వరకు ప్రపంచంను మార్చినారు. ఇకముందు కూడ మార్చుతారు. “మార్గరెట్ మీడ్”
తెలంగాణ భారత్ బచావో- రాష్ట్ర కమిటి
యం.ఎఫ్. గోపీనాథ్- 7995539191, గాదె ఇన్నయ్య 8186993218