ఏడు గంటలకే పోలింగ్ షురూ .. రాష్ట్ర వ్యాప్తగా మొరాయిస్తున్న ఈవీఎంలు
తెలంగాణలో ఉదయం 7గంటలకే పోలింగ్ మొదలైంది. పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. హైదరాబాద్ లో ని చిలుకానగర్, సిద్ధిపేటలో 118 కేంద్రాలు, సూర్యాపేటలో 89, కరీంనగర్ లో 371 కేంద్రాల్లోను సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని వాణీనగర్ వంటి పలు కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయక పోలింగ్ ఆలస్యమవుతోంది.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. కావున్న ఓటర్లు అందరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాల్సిందిగా అధికారులు, రాజకీయ నేతలు కోరతున్నారు.
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ సెంటర్ మార్క్ స్కూల్ వద్ద ఈవీఎంలు పని చేయలేదు. దీంతో అక్కడ ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. కరీంనగర్ లోని 371 పొలీంగ్ స్టేషనులో కూడా ఇదే పరిస్థితి. పోలింగ్ స్టేషన్ ముందు ఓటర్లు బారులు తీరారు. సంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.