షాద్ నగర్ లో ముగిసిన పోలింగ్ 81.96 గా నమోదైన పోలింగ్ శాతం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో జరిగిన ఎన్నికల ప్రక్రియ రాత్రి 8:30 కు ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 2,36,338 మంది ఓటర్లకు గాను 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ రాత్రి 8:30 వరకు కొనసాగింది. ఆయా పోలింగ్ కేంద్రాలలో మొత్తంగా ఒక లక్ష 93,714 ఓట్లు పోలైనట్లు ఎన్నికల …
షాద్ నగర్ లో ముగిసిన పోలింగ్
81.96 గా నమోదైన పోలింగ్ శాతం.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో జరిగిన ఎన్నికల ప్రక్రియ రాత్రి 8:30 కు ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 2,36,338 మంది ఓటర్లకు గాను 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ రాత్రి 8:30 వరకు కొనసాగింది. ఆయా పోలింగ్ కేంద్రాలలో మొత్తంగా ఒక లక్ష 93,714 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు.
అందులో పురుషులు 97,594, మహిళలు 95,089, ట్రాన్స్ జెండర్ 01గా నమోదైనట్లు వారు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 81.96 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు మీడియాకు తెలిపారు.