Telangana

వైరల్ అవుతున్న ఓ సామాన్యుడి పోస్ట్

మీలో ఎవరు కోటీశ్వరులు ప్రోగ్రామ్ చూసినట్టు…
రాష్ట్రప్రజలందరూ ఆసక్తితో చూస్తున్నారు…

రేపటి ఓటరు తీర్పు కోసం.

ఓ సామాన్యుని మదిలో మెదిలే కొన్ని ఆలోచనలు..

సీఎం ఏ పార్టీ వారైనా అవ్వండి.
కానీ దుబారా ఖర్చు తగ్గించండి.

బంధు పేరిట వందల ఎకరాలకు ఇవ్వకుండా, 15 ఎకరాలలోపే రైతులకు పంట సహాయం చేస్తాం అని భరోసా ఇవ్వండి.

రాళ్లకు రప్పలకు బంధులు వొద్దు భరోసాలు వొద్దు.

ఉన్నవాటిని కూల్చకండి.
లేని వాటి కోసం కోట్లకు కోట్లు తగలెయ్యకండి.

మాకు ప్రసిద్ధ కట్టడాలు వొద్దు కానీ ప్రతీ రోజు అడ్డా మీద పనికెల్లే కూలికి,పిహెచ్.డీ లు చేసి ఖాళీగా ఉన్న వారికి ఆశ దీపాలు అవ్వండి

నిరుద్యోగుల యెడల సహృదయత కల్గి ఉండండి.

అప్పుల్లో రాష్ట్రాన్ని నెట్టకండి… ఆదాయ మార్గాలు పెంచండి.

అసెంబ్లీలో గంటలకొద్దీ ఊకదంపుడు ఉపన్యాసాలు చేయొద్దు…మీ హయాంలో ఇలా మా హయాంలో ఇలా అని ప్రజలను వెర్రోళ్లను చేయకండి.

ముఖ్యంగా ప్రజలను సోమరులుగా మార్చే పథకాలు వొద్దు..ప్రజలు స్వచ్చందంగా బ్రతకడానికి పథకాలు తీసుకురాండి.

MLA కలవాలంటే చోట మోటా నాయకులతో పనిలేదు,వర్కింగ్ హార్స్ లో కలవొచ్చూ అని భరోసా ఇవ్వండి.

తండాలలో ,చిన్న ఊర్లలో 1 నుండి 5వ తరగతి చదువుతున్న పిల్లకు ఒక్కడే టీచర్ ఉన్నాడు ఆ పరిస్తితి మార్చండి.

ప్రతీ నియోజకవర్గ మండలంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో X-ray, CT Scan,పొట్ట స్కాన్ పరికరాలు ఉంచండి అవి తీయడానికి నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వండి….ప్రయివేటు సిస్టం మొత్తం నిరుద్యుగులే తీసేది రిపోర్ట్ పైన కేవలం డాక్టర్ మాత్రమే సంతకం పెడతాడు.ఇది చేయండి.

ఉపాధికల్పనకు ఊతం ఇవ్వండి.

డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి వడ్డీలు చెల్లించాలి,సిస్టంలో లోపాలు సవరించండి.

ఒక ఊరిలో దళితులకు అందరికి కలిపి మొత్తం 40 ఎకరాలు ఉంటే ,అదే ఊర్లో ఒక్కడికి 40 ఎకరాలు ఉంటాయి.ఇద్దరి ఓటుకు ఒకే విలువ ఉంటే ఇద్దరికి ఒకే రకంగా రైతు సాయం రావాలి.

తేడాలు ఎందుకు?

రియల్ ఎస్టేట్ మూలంగా సామాన్యుడు ఇండ్లస్థలం ఒక పెను భారం అయ్యింది దాన్ని సరిచేయండి…

ఇలా చాలా ఉన్నాయండి కాస్త ఆలోచిస్తారు కదా సీఎం గారు….ఇది ఒక CM(కామన్ మ్యాన్) కోరిక…

తప్పుంటే మన్నించండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button