కేసీఆర్​కు వైఎస్ షర్మిల కానుక... తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆదివారం రాబోతున్న దృష్ట్యా.. రేపటి రోజున రాష్ట్రానికి మరో విమోచన దినం కావాలి అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ప్రజల నిజమైన ఫలితాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫలితాలు రెఫరెండం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కేసీఆర్​కు రెండు సార్లు అధికారం ఇచ్చినా.. వాగ్దానం చేసిన ఒక్కమాట నిలబెట్టుకొలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఎలాంటి జిమ్మిక్కులు చేయకుండా ప్రజా తీర్పును …

కేసీఆర్​కు వైఎస్ షర్మిల కానుక...

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆదివారం రాబోతున్న దృష్ట్యా.. రేపటి రోజున రాష్ట్రానికి మరో విమోచన దినం కావాలి అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ప్రజల నిజమైన ఫలితాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫలితాలు రెఫరెండం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.

కేసీఆర్​కు రెండు సార్లు అధికారం ఇచ్చినా.. వాగ్దానం చేసిన ఒక్కమాట నిలబెట్టుకొలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఎలాంటి జిమ్మిక్కులు చేయకుండా ప్రజా తీర్పును శిరసావహించాలని సూచించారు.

“రాహుల్ గాంధీపాదయాత్ర, కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్​కు హైప్ వచ్చింది. మేం పాదయాత్రలు చేసినా, పోరాటాలు చేసినా మాకు రాకున్నా కాంగ్రెస్ వచ్చింది సంతోషం.

కేసీఆర్ పాలన అంతం అవ్వాలని, ఓటు చీలకూడదనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం.

నాతో పోరాటం చేసిన వాళ్లు, నా పార్టీ వాళ్లు కేసీఆర్​తో కలవడం బాధేసింది. కేసీఆర్​కు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం. బై బై కేసీఆర్ ఇక పెట్టాబేడా సర్దుకుని బయల్దేరండి.” అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

Updated On 2 Dec 2023 6:36 PM IST
cknews1122

cknews1122

Next Story