తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని గౌరవప్రదంగా స్వీకరిస్తున్నాం…
ప్రతిపక్ష హోదాలో కెసిఆర్ అడుగు జాడల్లో హుందాతనంగా వ్యవహరిస్తాం…
ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్…
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
డిసెంబర్ 04,
ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ అధ్యక్షన ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన
బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేసిన అధికారులకు ప్రత్యేక అభినందనలు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి..
కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఆ పార్టీ అభ్యర్థులకు, తన తరఫున పార్టీ నాయకత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సారధ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అభివృద్ధి, సంక్షేమాన్ని అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి..
దేశానికి ఆదర్శంగా నిలిచే సంక్షేమ పథకాలను కెసిఆర్ అమలు చేశారు.. తెలంగాణను తెచ్చిన ఘనతను, దేశానికి ఆదర్శంగా నిలిపిన పాలను కొనసాగించిన కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరుపలేరు అని తెలిపారు.
పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు భద్రాచలం ఇన్చార్జిగా వ్యవహరించిన తనకు భద్రాచలం అభ్యర్థి విజయానికి సహకరించిన భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు.
భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలుపును పార్టీ అధినేత కేసీఆర్ కి అంకితం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో డిసిసికి చైర్మన్ కూరాకుల నాగభూషణం ,
నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, ఖమ్మం జిల్లా యువజన నాయకులు కృష్ణ చైతన్య , ఎన్నికల సమన్వయకర్తలు ఆర్ జె సి కృష్ణ , ఉప్పల వెంకటరమణ, సుబ్బారావు మరియు తదితరులు పాల్గొన్నారు.