
వివాదంలో ” వీరమల్లు “.. రిలీజ్ అడ్డుకుంటామంటూ వార్నింగ్
ఐదేండ్ల క్రితం మొదలైన పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాకు ఇప్పట్లో కష్టాలు తీరేట్లు కనబడడం లేదు. ఇప్పటికే రెండు నెలలుగా అడ్డంకులను, అవరోధాలను, దాటుకుని వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా గత నెల జూన్12 నే విడుదల కావాల్సి ఉండగా విజువల్స్ ఆలస్యం వల్ల వాయిదా పడగా ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని ఇటీవలే కొత్త విడుదల తేదీని సైతం ప్రకటించి ప్రచార కార్మక్రమాలు షురూ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “హరిహర వీరమల్లు”. సినిమా రిలీజ్ ని అడ్డుకుంటామంటూ బిసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయి అంటూ ఆయా సంఘాల నాయకులు వార్నింగ్ ఇచ్చారు .
మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా హరిహర వీరమల్లు . ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు.
కాగా జూలై 24వ తేదీ ఎట్టకేలకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు . అదే విషయాన్ని అఫీషియల్ గా కూడా ప్రకటించారు . ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ .. ట్రైలర్.. సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది .
ఈ సినిమా కచ్చితంగా అభిమానులను ఆకట్టుకోవడమే కాదు చరిత్రలో నిలిచిపోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్న మూమెంట్లో ఈ సినిమాని అడ్డుకుంటామని బిసి నాయకుడు డాక్టర్ వై. శివ ముదిరాజ్ హెచ్చరించారు . దానికి కారణం కల్పిత పాత్రను సృష్టించడమే . తెలంగాణ పోరాటయోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారు అంటూ ముదిరాజులు నిరసనకు దిగారు .
అంతేకాదు సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు సంపాదించుకున్న సాయన్న దొరలు దేశ్ముఖల సంపద కొల్లగొట్టి పేదలకు పంచిన గొప్ప వ్యక్తి సాయన్న అని.. మరి అలాంటి సాయన్న కథలను వక్రీకరించారు అంటూ ముదిరాజులు ఆందోళనకు దిగారు .
అంతేకాదు సంబంధం లేని అంశాలను సినిమాలో పొందుపరిచి సినిమాకి పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకోవడానికి చూస్తున్నారు అని ఆరోపించారు . డబ్బుల కోసం తప్పుదారి పట్టించేలా మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రాన్ని జనాలు బహిష్కరించాలి అని .. జనాలందరూ ఈ సినిమాని చూడకుండా ఉండాలి అని .. సినిమా రిలీజ్ అడ్డుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ వేదికగా ఈ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ హరిహర వీరమలకు కోకుకోలేని షాక్ తగిలినట్టు అయింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?? మేకర్స్ ఎలా ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది..!!!