మంత్రివర్గంలో గిరిజన లంబాడీలకి మంత్రి పదవి ఇవ్వాలి.
భారతీయ గోర్ బంజారా పోరాట సమితి డిమాండ్.
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా: నియోజకవర్గం మంత్రివర్గంలో గిరిజన లంబాడ బిడ్డలకు మంత్రి పదవి ఇవ్వాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్-అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్. డిమాండ్ చేశారు.
గురువారం వైరా నియోజకవర్గంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బానోతు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 30 లక్షల పైగా జనాభా కలిగిన లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని,
కానీ మంత్రివర్గంలో చోటు రాలేదని తన ఆవేదన వ్యక్తం చేశారు, గిరిజనులకు ట్రైబల్ మినిస్టర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రవిచందర్ చౌహన్, పాల్వంచ మండలం అధ్యక్షులు విజయ్. జూలూరుపాడు మండల అధ్యక్షుడు బానోతు రాంబాబు, మండల సెక్రెటరీ లగావత్ గణేష్ ఏనుకూరు మండల అధ్యక్షులు రమేష్ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది