
నాలాలో కొట్టుకువచ్చిన మహిళ మృతదేహం..
నాలాలో మహిళ మృతదేహం కొట్టుకు వచ్చిన ఘటన బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి రైతు బజార్ సమీపంలోని నాలాలో ఓ మహిళ మృతదేహం కొట్టుకుపోతుందంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి లింగంపల్లి మార్కెట్ సమీపంలోని నాలాలో మహిళ మృతదేహాం ఉందని, స్థానికులు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెళికితీశారు. కాగా మహిళకు సంబంధించిన వివరాలు తెలియలేదు.
ఆమె చేతిపై నర్సమ్మ అనే పచ్చబొట్టు, ఒక పర్స్ లభించగా ఆందులో బంగారు కమ్మలు, ఒక బ్రేస్ లెట్‌తో పాటు ఫోన్ నంబర్‌ను గుర్తించినట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖాన తరలించారు.