రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి……..జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 09
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే అన్నారు.శనివారం నాడు భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు…మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని, ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించడం జరుగుతుందని వివరించారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం పోస్టరును ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలెక్టర్ ప్రారంభించి అదే బస్సులో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి భువనగిరి బస్టాండ్ వరకు మహిళలు, అధికారులతో కలిసి ప్రయాణం చేశారు.
కార్యక్రమాలలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కలెక్టర్ ఏ.భాస్కరరావు,యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కార్యనిర్వాహక అధికారి ఎన్.గీత,యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ సుధా హేమేంధర్ గౌడ్,జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి అన్నపూర్ణ,జిల్లా రోడ్డు రవాణా అధికారి సురేందర్ రెడ్డి,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పరిపూర్ణాచారి,ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చిన్ను నాయక్,ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్,మహిళలు,ప్రజాప్రతినిధులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.