కరాచీ బేకరీలో ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
కరాచీ బేకరీలో ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి హైదరాబాద్:డిసెంబర్ 14రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులను ముఖ్య మంత్రి ఆదేశించారు. గాయపడ్డ వారిలో ఎక్కు వగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు ఉన్నారని సీఎంకు అధికారులు తెలి యజేశారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్ …

కరాచీ బేకరీలో ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
హైదరాబాద్:డిసెంబర్ 14
రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులను ముఖ్య మంత్రి ఆదేశించారు.
గాయపడ్డ వారిలో ఎక్కు వగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు ఉన్నారని సీఎంకు అధికారులు తెలి యజేశారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్య సదుపా యాలు అందచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.కాగా..రాజేంద్ర నగర్‌లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది.
కరాచీ బేకరీ క్యాంటీన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమ యంలో అక్కడే ఉన్న కార్మి కులకు తీవ్ర గాయాల య్యాయి. దాదాపు 15 మందికి గాయాలవగా.. పలువురి పరిస్థితి విష మంగా ఉంది.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్క డకు చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే ప్రమాదం తర్వాత సిబ్బంది, యాజమాన్యం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. గుట్టు చప్పుడు కాకుండ బాధి తులను సిబ్బంది ఆస్పత్రికి తరలించిన..నిర్వాహకులు కిచెన్‌తో పాటు గోదాంకు తాళం వేసుకొని వెళ్లి పోయారు
