గెలుపోటములు సహజమే : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం
గెలుపోటములు సహజమే : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం సీ కే న్యూస్ ప్రతినిధి / కొల్లాపూర్ : కొల్లాపూర్ ప్రజల తీర్పును అంగీకరించిన మాజీ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల పక్షం లోనే ఉంటాం పర్యాటకం మీ చేతుల్లోనే ఉంది కొల్లాపూర్ ను అభివృద్ధి చేయండి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు కొల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎలక్షన్ సమయంలో ప్రజలు …
గెలుపోటములు సహజమే : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం
సీ కే న్యూస్ ప్రతినిధి / కొల్లాపూర్ :
కొల్లాపూర్ ప్రజల తీర్పును అంగీకరించిన మాజీ ఎమ్మెల్యే
ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల పక్షం లోనే ఉంటాం
పర్యాటకం మీ చేతుల్లోనే ఉంది కొల్లాపూర్ ను అభివృద్ధి చేయండి
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు
కొల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి
కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎలక్షన్ సమయంలో ప్రజలు ఇచ్చిన తీర్పులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఓటమికి గురయ్యారన్న విషయం తెలిసిందే గురువారం ఆయన కొల్లాపూర్ నియోజకవర్గం లో ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల తీర్పును నేను గౌరవిస్తున్నానని ఆయన విలేకరుల మాట్లాడడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ నాకు అండగా ఉండి నాకు మద్దతుగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ గతంలో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఏలాంటి కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చిన అండగా ఉన్నాను కరోనా సమయంలో ఎంత కష్టం వచ్చినా నియోజకవర్గ ప్రజల వెంటే ఉన్నాను అనీ ఆయన ప్రెస్మీట్లో ఉన్న కార్యకర్తలకు మరోసారి గుర్తు చేశారు మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కొల్లాపూర్ నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందు ఉంచాననీ ఆయన వారికి మరోసారి గుర్తు చేశారు
కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజల చిరకాల స్వప్నం సోమశిల సిద్దేశ్వర బ్రిడ్జి జాతీయ రహదారి , హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల , పాలిటెక్నిక్ కళాశాల, బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, కోడేరు , పాన్ గల్, వీపన గండ్ల మండల కేంద్రాలలో సి సి రోడ్లు నిర్మాణాలు పూర్తి చేసాము అని ఆయన అన్నారు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తన మన అని తేడా లేకుండా ఆరోగ్యం బాలేకుండా ఉన్న కుటుంబాలకు అండగా ఉంటూ దాదాపు 15 కోట్ల రూపాయలను సీ ఎం ఆర్ ఎఫ్ ఎల్ ఓసి రూపం లో అండగా ఉన్నాననీ ఆయన మాట్లాడుతూ అన్నారు
రైతులకు సాగునీటి విషయంలో సింగోటం గోపాల్దిన్నె , బాచారం హై లెవెల్ కెనాల్ , రామన్న గట్టు , మల్లేశ్వరం లిఫ్ట్ , పసుపుల బ్రాంచ్ కెనాల్ వైండనింగ్ , జిల్దార్ తిప్ప , మంజూరు చేశామని ఇప్పుడున్న నాయకులు పనులు పూర్తి చేయాలని అన్నారు అనంతరం ప్రజా తీర్పును గౌరవిస్తూ గెలిచిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ మీడియా సమావేశంలో ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు