— తండ్రీ, కొడుకుల ఆత్మహత్యా యత్నం. —వ్యవసాయ భూమి కోల్పోతామన్న ఆందోళనతో. — సీకె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్. తండ్రి, కొడుకులు ఆత్మహత్య యత్నం చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం వియ్యం బంజర్ గ్రామం సోమ్లా నాయక్ తండాకు చెందిన తండ్రి బానోతు మీటు, కొడుకు బానోతు కృష్ణ అనే రైతులు కలుపు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వియ్యం బంజర్ ఎన్ఎస్పి కాలువ …

— తండ్రీ, కొడుకుల ఆత్మహత్యా యత్నం.

—వ్యవసాయ భూమి కోల్పోతామన్న ఆందోళనతో.

— సీకె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

తండ్రి, కొడుకులు ఆత్మహత్య యత్నం చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం వియ్యం బంజర్ గ్రామం సోమ్లా నాయక్ తండాకు చెందిన తండ్రి బానోతు మీటు, కొడుకు బానోతు కృష్ణ అనే రైతులు కలుపు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వియ్యం బంజర్ ఎన్ఎస్పి కాలువ వద్ద రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పంట వేశారు. వారి పొలం ప్రభుత్వ భూమి ఉందని కొందరు అయ్యప్ప స్వాములు గుడి కడతామని ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించారు.

ఇది మా భూమిని గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి మీదే ఆధారపడి మా కుటుంబం బతుకుతున్నామని సర్వే చేసి మా భూమి మాకు చూపించి ప్రభుత్వ భూమి ఉంటే మాకు సంబంధం లేదని తండ్రి కొడుకులు స్వాములతో చెప్పారని తెలిపారు.

అయ్యప్ప స్వాములు సమయం లేదని ఇప్పుడే మేము ఫ్లెక్సీలు, జెండాలు పాత తామని చెప్పి ఫ్లెక్సీలు పెట్టడంతో తమ భూమిని కోల్పోతామన్న మనోవేదనకు గురై మనస్థాపం చెంది తండ్రి మీటు, కొడుకు కృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడుకు కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం తరలించారు.

Updated On 14 Dec 2023 8:17 PM IST
cknews1122

cknews1122

Next Story