మాగోడు వినే వారే లేరు...అనేక సమస్యలతో ప్రైవేట్ అధ్యాపకులు
— మాగోడు వినే వారే లేరు . — అనేక సమస్యలతో ప్రైవేట్ అధ్యాపకులు. — ఎమ్మెల్యే మట్ట రాఘమయి కి వినతిపత్రం అందజేత. సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు పనిచేస్తున్న తమను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సత్తుపల్లి డివిజన్ అధ్యక్షుడు దూదిపాల ప్రభు కుమార్ చౌదరి ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కి వినతి పత్రం అందజేశారు. …
![మాగోడు వినే వారే లేరు...అనేక సమస్యలతో ప్రైవేట్ అధ్యాపకులు మాగోడు వినే వారే లేరు...అనేక సమస్యలతో ప్రైవేట్ అధ్యాపకులు](https://cknewstv.in/wp-content/uploads/2023/12/IMG-20231216-WA0135.jpg)
— మాగోడు వినే వారే లేరు .
— అనేక సమస్యలతో ప్రైవేట్ అధ్యాపకులు.
— ఎమ్మెల్యే మట్ట రాఘమయి కి వినతిపత్రం అందజేత.
సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు పనిచేస్తున్న తమను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సత్తుపల్లి డివిజన్ అధ్యక్షుడు దూదిపాల ప్రభు కుమార్ చౌదరి ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కి వినతి పత్రం అందజేశారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఉపాధ్యాయునికి ప్రభుత్వం గుర్తింపు కార్డులను ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి 10 లక్షల వరకు ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాలని డిమాండ్ చేశారు.
మా గోడు వినే వారే లేక అనేక సమస్యలతో సతమతమై పోతున్నామని వాబోతు కనీస వేతనాన్ని అమలు చేయాలని, పి.ఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, అధ్యాపకుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలలో 50 శాతం ఫీజు రాయితీని కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్రంలో ఏడు లక్షల 50వేలకు పైగా ఉన్న ప్రైవేటు అధ్యాపకుల కొరకు ఆపత్కాల పరిస్థితితుల సంక్షేమ నిధి 500 కోట్లతో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తు సమస్యలను పరిష్కరించి అధ్యాపకులను ఆదుకోవాలని కోరారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)