సింగరేణి ఎన్నికలపై మళ్ళీ పీఠముడి..
ఈ నెల డిసెంబర్ 27న జరగాల్సిన కార్మిక సంఘ ఎన్నికలను వచ్చే మార్చి నెల వరకు వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి..
ఇప్పటికే మేనిఫెస్టోలు విడుదల చేసి ప్రచారాన్ని ముమ్మరం చేసిన కార్మిక సంఘాలు..
గెలుపు పై ధీమాతో ఉన్న INTUC గత కొద్దరోజులుగా INTUC కొనసాగుతున్న భారీ చేరికలు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు, వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్టే ఇవ్వాలని కోరిన పిటిషనర్..
వాయిదా యత్నాలను పసిగట్టి మూడు రోజులుగా హైదరాబాద్ లొ సంబంధిత మంత్రిత్వ శాఖ మరియు కోల్బెల్ట్ ఎమ్మెల్యేలతో వాయిదా వేయకుండా ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చర్చలు జరిపిన జనక్ ప్రసాద్ మరియు INTUC బృందం.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లోనూ పునరావృతం కావాలని మంత్రి శ్రీధర్ బాబు ఐఎన్టీయూసీ నేతలకు మరియు కొల్ బెల్ట్ ఎమ్మెల్యే లకు దిశానిర్దేశం..
వివిధ కారణాలతో ప్రతీసారీ వాయిదా పడుతున్న నాల్గేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ..
మళ్లీ కోర్ట్ మెట్లెక్కడంతో సింగరేణి ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ.