హైదరాబాద్ తార్నాకలో గ్యాంగ్‌రేప్, స్నేహితులతో కలిసి.. తార్నాకలో ఘోరం జరిగింది. ఆదివారం రాత్రి లిఫ్ట్ పేరిట ఒక మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. నలుగురు కలిసి ఆ ఒంటరి మహిళగా అఘాయిత్యానికి పాల్పడ్డారు.బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు. ఆపై ఆమెను కిడ్నాప్ చేసి తార్నాకలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. …

హైదరాబాద్ తార్నాకలో గ్యాంగ్‌రేప్, స్నేహితులతో కలిసి..
తార్నాకలో ఘోరం జరిగింది. ఆదివారం రాత్రి లిఫ్ట్ పేరిట ఒక మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. నలుగురు కలిసి ఆ ఒంటరి మహిళగా అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు.
ఆపై ఆమెను కిడ్నాప్ చేసి తార్నాకలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే తన స్నేహితుల్ని రప్పించుకున్న నిందితుడు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న లాలాగూడ పోలీసులు.. ప్రశాంత్.. మధుసూదన్.. రోహిత్ తరుణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
