కృష్ణవేణి టాలెంట్ స్కూల్, భువనగిరి కి బెస్ట్ స్కూల్ అవార్డు….
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 19
సోమవారం నాడు హైద్రాబాద్ లోని బ్రెయిన్ ఫీడ్ మాగజైన్ వారు నిర్వహించిన విద్యా సదస్సు లో భువనగిరి పట్టణం లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి 2023-24 విద్యాసంవత్సరం లో మోస్ట్ ఇన్స్పైరింగ్ స్కూల్స్ అఫ్ ఇండియా మరియు మోస్ట్ ఇన్నోవటివ్ స్కూల్స్ అఫ్ ఇండియా గా గుర్తించి, స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ అఖిల మాట్లాడుతూ…ఈ విద్యాసంవత్సరం మన పాఠశాలలో ఆక్టివిటీ బేస్డ్ విద్యాబోధన పద్ధతి ని గుర్తించి ఈ అవార్డు రావడం చాలా సంతోషం గా వుంది అని పేర్కొన్నారు.