కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
సత్తుపల్లి మండలం పరిధిలోని గంగారం 15వ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కొమరం లక్ష్మణరావు బేతపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు,
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో సత్తుపల్లి పట్టణం లోజరుగు ఓ వివాహ వేడుక కు హాజరై తిరిగి రాత్రి 12:30 గంటల సమయంలో ఇంటికి చేరుకొనగా గుర్తుతెలియని వ్యక్తులు వంటగది కిటికీ తలుపులు తీసి లోపలకు ప్రవేశించి
బీరువాలో ఉన్న 210 గ్రాముల పలు వస్తువులతోపాటు 25 వేల రూపాయల నగదు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి నట్లు సుమారు బంగారు విలువ 12 లక్షల రూపాయల మేరకు ఉంటుందని బాధితుడు లక్ష్మణరావు పేర్కొన్నారు,
బాధితుడు ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,