27వ జాతీయ యువజనోత్సవాల సందర్బంగా జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపిక…..
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 21
యాదాద్రి భువనగిరి జిల్లా
జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపిక-2024,27వ జాతీయ యువజనోత్సవాల సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపిక 21-12-2023వ తేదీన భువనగిరి ఖిల్లా,భువనగిరి నందు ఉదయం 10 :00 గంటలకు ముఖ్య అతిథులుగా హజరైన స్థానిక ACP-శ్రీ వెంకట్ రెడ్డి, MPP-నరాల నిర్మల గారు , ZPTC-బీరు మల్లయ్య ,వార్డు కౌన్సిలర్ లక్ష్మీ మరియు జిల్లా యువజన & క్రీడల శాఖ అధికారికె. ధనుంజనేయులు గార్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించడం జరిగినది
.అనంతరం ఇట్టి కార్యక్రమమును ఉద్దేశించి ACP-శ్రీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…విద్యార్థిని విద్యార్థులు మరియు యువత చదువుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమములలో పాల్గొనడం ద్వారా మానసిక మరియు శారీరక ఉల్లాసం కలిగి వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని తెలిపినారు.అదేవిధంగా జిల్లా యువజన & క్రీడల శాఖ అధికారి కె. ధనుంజనేయులు మాట్లాడుతూ..కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమముల ద్వారా యువతీ యువకుల్లో దాగివున్న సాంస్కృతిక కళా నైపుణ్యాలను వెలికితీసి, ఇక్కడ నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీలలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందిన వారిని రాష్ట్ర స్థాయి లో పాల్గొనుటకు పంపించబడును అని తెలిపినారు.
రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ప్రదర్శన చేసి అక్కడ ఎంపిక కాబడిన ఉత్తమ కళాకారులు జనవరి 12నుండి 16వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాలలో పాల్గొంటారని తెలియజేసినారు.
జిల్లా స్థాయిలో న్యాయ నిర్ణేతలుగా డ్యాన్స్ మాస్టర్స్ – భరత్, రమేశ్ రాజ్, శ్రీనివాస్ ,యం.డి. జైనులుద్దీన్, యన్.కృష్ణ, వినోద్ గార్ల ఆధ్వర్యంలో విజేతలను ఎంపిక చేయడం జరిగినది.
సాముహిక ప్రదర్శనలు:
1.జానపద నృత్యము: (Folk Dance Group): మొదటి విజేత : క్యాండర్ గ్రూప్ (కొయ్యలగూడెం) ద్వీతీయ విజేత :స్పందన డ్యాన్స్ గ్రూప్ (జనగాం -నారాయణపూర్ ), తృతీయ విజేత :జాస్మిన్ డ్యాన్స్ గ్రూప్ (భువనగిరి)
2.జానపద నృత్యము: (Folk Dance Solo): మొదటి విజేత :T.చైతన్య (భువనగిరి) ద్వీతీయ విజేత : B.సౌమ్యశ్రీ (భువనగిరి) తృతీయ విజేత :R.శ్రీజ
3 .జానపద గేయాలు: (Folk Song Solo ): మొదటి విజేత :జె. చందన (జనగాం -నారాయణపూర్) ద్వీతీయ విజేత : సి. హెచ్. వర్షిణి (జానకిపురం -అడ్డగుడూర్ )
వ్యక్తిగత ప్రదర్శనలు:
4.వ్యాస రచన పోటీ: (Story Writing):
హిందీ :మొదటి విజేత :మహేశ్వరి . ద్వీతీయ విజేత :యం.డి. సానియా
ఇంగ్లీష్ : మొదటి విజేత :పి. అంజలి, ద్వీతీయ విజేత :బి. బిందు
5.పోస్టర్ మేకింగ్:( Painting): మొదటి విజేత :యన్. లావణ్య, ద్వీతీయ విజేత: పి. అంజలి. తృతీయ విజేత: టి.అమూల్య.
6. వకృత్వ పోటీ ( Declamation) : మొదటి విజేత :బి. బిందు
ఇట్టి కార్యక్రమములో సుమారు 250 మంది కళా ఔత్సాహిలు,యువజన సంఘాల అధ్యక్షులుకరుణ్ మరియు కార్యాలయ సిబ్బంది మురళి ,జయ రాజశేఖర్,బి.రేణుక, కైసర్ , శ్రీనివాస్ , రేణుక ,సైదులు తదితరులు పాల్గొన్నారు.