పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 21 పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే సూచించారు.గురువారం నాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భువనగిరి కేంద్రీయ విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని కేంద్రీయ విద్యాలయ కార్యకలాపాలను పిపిటి ద్వారా వీక్షించారు. …

పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి..

జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 21

పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే సూచించారు.గురువారం నాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భువనగిరి కేంద్రీయ విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని కేంద్రీయ విద్యాలయ కార్యకలాపాలను పిపిటి ద్వారా వీక్షించారు.

ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థుల పురోగతిని తెలుసుకున్నారు.అదనపు తరగతులు నిర్వహించి పదవ తరగతి పరీక్షలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని,వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను వచ్చే జనవరిలోగా పూర్తి చేయాలని సూచించారు.కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ చంద్రమౌళి,నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి భరత్,పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్, మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Updated On 21 Dec 2023 5:50 PM IST
cknews1122

cknews1122

Next Story