రూ.99 కే తిన్నంత బిర్యానీ.. హైదరాబాద్‌లో ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్: అమీర్ పేట్.. ఈ పేరు వినగానే కోచింగ్ సెంటర్లు, బుక్ స్టాళ్లు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్లు గుర్తొస్తాయి. అయితే అమీర్‌పేట(Ameerpet)లో ఓ ప్లేట్ బిర్యానీ తినాలంటే మినిమం రూ.200 ఖర్చు చేయాల్సిందే.
పైగా ఎక్స్‌ట్రా రైస్ అడిగితే లేదని మోహంపైనే చెప్తారు కొందరు. ఇలాంటి వారి కోసమే అమీర్ పేట నడిబొడ్డున బిర్యానీ సెంటర్ ఓపెన్ చేశారు యజమానులు.
అందులో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అది రూ.99 బిర్యానీ(RS.99 Biryani).. అందులో తిన్నంత బిర్యానీ దొరుకుతుంది. దాని విశేషాలివే… అమీర్ పేట్ మైత్రివనం దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎదురుగా మధు బిర్యానీ సెంటర్లో(తోపుడు బండి) కేవలం రూ. 99 కే తిన్నంత చికెన్ బిర్యానీ అందిస్తున్నారు.
రుచిలో రాజీపడరు..
రేటు తక్కువే అయినా టేస్ట్ విషయంలో వీళ్లు రాజీపడట్లేదు. అందుకే మధ్యాహ్నం కాగానే దీని కోసం జనం పోటీపడతారు.
లైన్లో నిలుచుని మరీ రూ. 99 బిర్యానీ తింటారంటే టేస్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీ రోజూ 600 మందికి పైగా ఇక్కడ బిర్యానీ తింటారని యజమానులు తెలిపారు.
బిర్యానీ తినేటప్పుడు ఓ కండిషన్ పెట్టారు యజమానులు. రూ.99 అని ఎక్కువ రైస్ వేసుకుని వృథా చేస్తే ఫైన్ వేస్తారు. భోజనం వేస్ట్ చేసిన వారికి రూ.200 వరకు జరిమానా విధిస్తారు.
ధరలివే..
చికెన్ బిర్యానీ – రూ. 99
ఎగ్ బిర్యానీ – రూ. 79
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ – రూ. 99.. కేపీ