Uncategorized

లోక్ అదాలత్ విజయవంతానికి సమిష్టి కృషి అవసరం

లోక్ అదాలత్ విజయవంతానికి సమిష్టి కృషి అవసరం

లోక్ అదాలత్ విజయవంతానికి సమిష్టి కృషి అవసరం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజ్

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 24

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ జయరాజ్ కోరారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లాలోని న్యాయమూర్తులు, సివిల్, ట్రాఫిక్ పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎ. జయరాజు మాట్లాడుతూ ఈ నెల 30న భువనగిరి , ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ ఆదాలత్ లో అధిక కేసుల పరిష్కారానికై న్యాయమూర్తులు, పోలీసు యంత్రాంగం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ లోక్ ఆదాలత్ లలో రాజీ పడదగు అన్ని క్రిమినల్, సివిల్ కేసులు ,భూ సేకరణ, ట్రాఫిక్ చాలాన్ , మరియు టెలిఫోన్, బ్యాంకు వారికి ఋణ బకాయి చెల్లింపుల వివాదాలను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ఆయా కోర్టుల పరిధులలో ప్రి సిట్టింగ్స్ కూడా ఏర్పాటు చేసి కేసుల త్వరిత పరిష్కానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశములో పాల్గొన్న న్యాయమూర్థులకు, పోలీసులకు తగు సూచనలు చేసారు.ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. మారుతి దేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంచార్జ్ కార్యదర్శి కె. దశరథ రామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ డి. నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జి. కవిత, సివిల్ మరియు ట్రాఫిక్ పోలీసులు, న్యాయ సహాయ న్యాయవాదులు ఎస్. జైపాల్, జి. శంకర్,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రామన్నపేట,ఆలేరు, చౌటుప్పల్ న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button