అటెండర్ తో బూట్లు మోయించిన కలెక్టర్
భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 25
ఐఏఎస్ అధికారి భవేశ్ మిశ్రా వివాదంలో చిక్కు కున్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న ఆయన కింది స్థాయి సిబ్బందితో తన బూట్లు మోయించారనే ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు.
భవేశ్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయకపోయినప్పటికీ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
దీంతో ఉన్నతమైన హోదా లో ఉన్న వ్యక్తి ఇలా చేయ డం ఏంటని నెటిజన్లు ప్రశ్ని స్తున్నారు.ఇంతకు ఏమైం దంటే.. భవేశ్ మిశ్రా భూపాలపల్లి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చికి వెళ్లిన ఆయన.. అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఆయన తన కాళ్లకు ఉన్న షూ విడవ కుండానే చర్చిలోకి వెళ్లారు.
ఈ విషయం గమనించిన కలెక్టర్ తాను వేసుకున్న షూ విప్పి అటెండర్‌కు ఇచ్చారు. దీంతో కలెక్టర్ బూట్లను అటెండర్ మోస్తూ కనిపించాడు. తిరిగి చర్చి నుంచి బయటకొచ్చిన తర్వాత కలెక్టర్‌కు షూ తిరిగిచ్చేశాడు.