“హార్వెస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు”
బోథ్ హార్వెస్ట్ చర్చిలో పాస్టర్ సునీల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్య అతిధిగా హాజరైన బిషప్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ పాపపు బానిసత్వంలో జీవిస్తూ నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడని చెప్పారు.
అయన జన్మించినప్పుడు జ్ఞానులకు ఆకాశపు నక్షత్రం వారికి దారికి చూపించింది. ప్రపంచంలో ప్రతి మనిషి ఒక స్టార్ గా ఉండాలి అనేకులకు మేలుచేసే మంచి మనసు ప్రతి మనిషికి ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం.
బ్రతికిన కొన్నిరోజులు మనం కూడా మంచిని గురించి చెప్పేవాళ్ళుగా, అనేకులకు మార్గదర్శకంగా ఉండాలని బైబిల్ నుండి క్రిస్మస్ సందేశాన్ని భక్తులకు భోదించారు.
నక్షత్రం జ్ఞానులకు దారిచూపించినట్లు నీతి న్యాయం కొరకు జీవించేవాళ్ళు అనేకులకు మంచి మార్గం గురించి చూపించడానికి దిశనిర్దేశం చేయాలి.
కానీ తప్పుడు మార్గంవైపు సమాజాన్ని నడిపించకూడదని భక్తులకు భోదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేందర్, ప్రజాప్రతినిధులు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.