Inter Exams :తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే.? తెలంగాణ ఇంట‌ర్ విద్యార్థుల‌కు గ‌మ‌నిక‌. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప్రారంభించేలా ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు రూపొందించిన షెడ్యూల్‌ను ప్ర‌భుత్వానికి పంపింది. మొత్తం మూడు షెడ్యూళ్ల‌ను ప్ర‌భుత్వానికి పంపింది విద్యాశాఖ‌. అందులో 2024 ఫిబ్ర‌వ‌రి 28, మార్చి 1, మార్చి 5 వ తేదీలు ఉన్నాయి. తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలకు మూడు షెడ్యూళ్లను ఇంటర్మీడియట్‌ బోర్డు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌ను పంపిన‌ట్లు తెలిసింది. వీటిపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి …

Inter Exams :తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే.?

తెలంగాణ ఇంట‌ర్ విద్యార్థుల‌కు గ‌మ‌నిక‌. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప్రారంభించేలా ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు రూపొందించిన షెడ్యూల్‌ను ప్ర‌భుత్వానికి పంపింది.

మొత్తం మూడు షెడ్యూళ్ల‌ను ప్ర‌భుత్వానికి పంపింది విద్యాశాఖ‌. అందులో 2024 ఫిబ్ర‌వ‌రి 28, మార్చి 1, మార్చి 5 వ తేదీలు ఉన్నాయి. తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలకు మూడు షెడ్యూళ్లను ఇంటర్మీడియట్‌ బోర్డు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌ను పంపిన‌ట్లు తెలిసింది.

వీటిపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెల‌ప‌డ‌మే త‌రువాయి అంశం. ఆయ‌న అమోదం తెల‌ప‌గానే ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఖ‌రారు చేస్తారని స‌మ‌చారం. వారం రోజుల్లో ఇక ప‌రీక్ష‌ల షెడ్యూల్ కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు, సెకండియర్‌ పరీక్షలకు 4.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్న‌ట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది కొంత ముందుగానే పరీక్షలు ముగించేలా ప్రణాళిక రూపొందించార‌ని స‌మాచారం.

ఇక ఇప్ప‌టికే ఫ్రీ ఫైన‌ల్ , ప్రాక్టిక‌ల్స్ వంటి ప‌రీక్ష‌ల‌కు తేదీల‌ను కూడా క‌న్ఫామ్ చేశారు. జ‌న‌వ‌రి 20 త‌ర్వాత ఫ్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌లు జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

వాటితో పాటు సైన్స్ ప్రాక్టిక‌ల్స్ వంటి ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో పెట్టే అవ‌కాశం ఉంది. ఈ ప‌రీక్ష‌ల‌కు గాను మొత్తం 1500 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. త్వ‌ర‌లో వీట‌న్నింటిపై క్లారిటీ రానుంది.

Updated On 26 Dec 2023 10:34 PM IST
cknews1122

cknews1122

Next Story