పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ ఓయూ పోలీసులకు ఓ వెరైటీ దొంగ చిక్కాడు. ఆ ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో చీటీ కూడా రాసి పెడతాడు శంకర్ నాయక్.. అలాగే డైరీలో ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో కూడా రాసుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటారా? పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తాడని ఓయూ పోలీసులు తెలిపారు. దొంగిలించబడ్డ సొమ్ముతో ముత్తూట్ గోల్డ్ లోన్‌లో తాకట్టు పెట్టి హోటల్స్‌లో విలాసవంతమైన జీవితం …

పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ
ఓయూ పోలీసులకు ఓ వెరైటీ దొంగ చిక్కాడు. ఆ ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో చీటీ కూడా రాసి పెడతాడు శంకర్ నాయక్.. అలాగే డైరీలో ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో కూడా రాసుకుంటాడు.
ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటారా? పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తాడని ఓయూ పోలీసులు తెలిపారు.
దొంగిలించబడ్డ సొమ్ముతో ముత్తూట్ గోల్డ్ లోన్‌లో తాకట్టు పెట్టి హోటల్స్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతూ, మిగిలిన ఆ డబ్బుతో మళ్లీ దొంగతనం చేయడానికి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి, ఆ బండ్లపై దొంగతనం చేసే వెరైటీ దొంగ ఈ శంకర్ నాయక్.
మహబూబ్‌నగర్‌కి చెందిన దొంగ శంకర్ నాయక్ గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అయినా దొంగ బుద్ది మారలేదు, హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేయడం దొంగిలించిన సొమ్ము ఎంత అనేది ఆ ఇంట్లో చీటీ రాసి మరి వెళతాడు.
ఇప్పటివరకు 94 దొంగతనాలు చేసిన శంకర్ నాయక్ చివరికి ఓయూ పోలీసులకు చిక్కి మళ్లీ రిమాండ్ అయ్యాడు.
అయితే రిమాండ్ చేసిన శంకర్ నాయక్ నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 మొబైల్ ఫోన్లు, డైరీ, చోరీకి ఉపయోగించిన వస్తువులు ఓయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
