రౌడీలుగా మారుతున్న విద్యార్థులు..!
మెదక్ కళాశాల వెళ్లి బాగా చదవాల్సిన విద్యార్థులు రౌడీలుగా తయారవుతున్నారు రోడ్ల మీదకు చేరి గ్యాంగ్ వార్‌లకు పాల్పడు తున్నారు.
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన వారు రోడ్ల వెంబడి తిరుగుతూ గొడవలకు పాల్పడుతున్నారు ఇలాంటి ఘటనే మెదక్ జిల్లా నర్సాపూర్ లో చోటుచేసుకుంది.
నర్సాపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు చిన్న గొడవ జరిగింది వాగ్వాదం కాస్త పెరిగి చివరకు పెద్ద దుమారానికి దారి తీసింది.
దీంతో ఓ విద్యార్థి చొక్కా విడిచి అర్ధనగ్నంగా తిరుగుతూ హంగామా చేశాదు కాలేజీ సెక్యూరీటి సిబ్బంది ఎంట్రీ ఇచ్చారు.
అది గమనించిన కాలేజీ విద్యార్థులు పరుగులు తీశారు ఈ ఘటన నర్సాపూర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో చోటుచేసుకుంది.