వివాదాస్పద స్థలంలో సమావేశాలు అడ్డుకోండి
తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన రాజాపురం భూ బాధితులు
తెలంగాణ ట్రైబల్ పాస్టర్ అసోసియేషన్లోనూ మొర పెట్టుకున్నబాధితులు
సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం
ములకలపల్లి మండలం జగన్నాథపురం పరిధిలోని రాజాపురం గ్రామానికి చెందిన ఊకె రాజేంద్రప్రసాద్ తన భూ వివాదం విషయంలో మరోసారి ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ కేసు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణలో ఉంది.
రెవెన్యూ అధికారుల సూచన మేరకు మేము సంయమనం పాటిస్తూ అక్కడికి వెళ్లడం లేదని కానీ వివాదాస్పదంగా మారిన ఈ స్థలంలో భారీ ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయమై తెలంగాణ ట్రైబల్ పాస్టర్స్ అసోసియేషన్లో కూడా ఫిర్యాదు చేశామని వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.
ములకలపల్లి మండలం జగన్నాధపురం రెవెన్యూ గ్రామ పరిధిలో గల రాజాపురం గ్రామంలో సర్వే నంబరు 618/2 లో ఉన్న సుమారు యకరంన్నర స్థలాన్ని సీతాయిగూడెం పంచాయతీ కొమ్ముగుడెం గ్రామానికి చెందిన మడి వెంకటేశ్వర్లు అలియాస్ ఎలిశా మరియు అతని కుమారుడు మడి వినోద్ అలియాస్ డేవిడ్ సన్ లు ఆక్రమించారని వివాదం రేగిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో జరిగిన వాగ్వాదంలో మడి వినోద్ అలియాస్ డేవిడ్ సన్ అతని అనుచరులు బాధితులైన ఊకే రాజేంద్రప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులపై తుపాకీ గురిపెట్టి అల్లకల్లోలం సృష్టించిన విషయంలో మడి వినోద్ అలియాస్ డేవిడ్ సన్ అతని అనుచరులపై కేసు నమోదు కావడమే కాకుండా రీమాండుకు కూడా వెళ్లారు.
మడి వెంకటేశ్వర్లు అలియాస్ ఎలిశా మొబైల్ కోర్టులో తప్పుడు పత్రాలు సమర్పించారని అందుకే తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామని ఊకే రాజేంద్ర ప్రసాద్ తెలిపాడు.
రెవెన్యూ అధికారులు మరొకసారి వివాదాస్పదం అయిన స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విచారణ పూర్తయ్యే వరకు ఇట్టి స్థలంలో ఎవ్వరూ ఉండరాదని సూచించారు. వారి సలహా మేరకు ఊకే రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు ఈ స్థలంలో ఇప్పటి వరకూ అడుగు పెట్టడం లేదు.
కానీ మడి వెంకటేశ్వర్లు అలియాస్ ఎలిశా ఈ స్థలంలో తనకే వచ్చిందని తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా ఆ స్థలంలో వేరే గ్రామాలకు చెందిన యువతులను అక్కడ ఉంచడం స్థానిక రాజపురం గ్రామస్తులకు అస్సలు ముఖ పరిచయం కూడా లేని వ్యక్తులు ఆ స్థలంలో రాకపోకలు సాగించడం లాంటివి చేస్తున్నారని బాధితులు తెలిపారు.
అంతే కాకుండా ఒక అటవీ అధికారి కూడా కొన్నాళ్లుగా అక్కడే మకాం వేసి ఉన్నాడని అందుకే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.