ఆరు గ్యారంటీల దరఖాస్తుల ఫారాలను ప్రారంభించిన సర్పంచ్ మారెళ్ళ మమత
సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజాపాలనకు అన్నారుగూడెంలో సకల సౌకర్యాలు ఏర్పాటు
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం సీకే న్యూస్ ప్రతినిధి : విజయ్ డిసెంబర్ :29
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఆరు గ్యారెంటీల దరఖాస్తులను శుక్రవారం అన్నారుగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 30వ తేదీన శనివారం ఉదయం 8 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న ఆరు గ్యారంటీలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా గెలిచిన తక్షణమే అమలు చేస్తున్న మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరఇండ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. గ్రామంలో వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్యం తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, యల్లంకి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, గుమ్మా వలరాజు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.