మద్యం మత్తులో కానిస్టేబుల్‌ వీరంగం! వైరల్‌గా మారిన కానిస్టేబుల్‌ చేసిన పని.. సస్పెండ్‌ చేసిన ఎస్పీ సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని ఘటనలు వైరల్‌గా మారిపోతున్నాయి.. మద్యం మత్తులో కానిస్టేబుల్‌ వీరంగం సృష్టించిన ఘటన అనంతపురంలో వైరల్‌ అయ్యింది.. జిల్లాలోని శింగనమల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వారిపట్ట దురుసగా ప్రవర్తించాడు కానిస్టేబుల్‌ షబ్బీర్‌.. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.. స్టేషన్‌కు వచ్చినవారిపై దూషణలకు దిగాడు.. అయితే, ఈ వ్యవహారం మొత్తం తన సెల్‌ఫోన్‌లో …

మద్యం మత్తులో కానిస్టేబుల్‌ వీరంగం!

వైరల్‌గా మారిన కానిస్టేబుల్‌ చేసిన పని.. సస్పెండ్‌ చేసిన ఎస్పీ

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని ఘటనలు వైరల్‌గా మారిపోతున్నాయి.. మద్యం మత్తులో కానిస్టేబుల్‌ వీరంగం సృష్టించిన ఘటన అనంతపురంలో వైరల్‌ అయ్యింది..

జిల్లాలోని శింగనమల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వారిపట్ట దురుసగా ప్రవర్తించాడు కానిస్టేబుల్‌ షబ్బీర్‌.. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.. స్టేషన్‌కు వచ్చినవారిపై దూషణలకు దిగాడు..

అయితే, ఈ వ్యవహారం మొత్తం తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. అదికాస్తా వైరల్‌ అయ్యింది..ఇక, ఈ ఘటన జిల్లా ఎస్పీ దృష్టి వరకు వెళ్లింది..

దీంతో.. శింగనమల కానిస్టేబుల్ షబ్బీర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీ.. షబ్బీర్ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు..

ప్రాథమిక విచారణ ఆధారంగా సస్పెన్సన్ ఉత్తర్వులు జారీ చేవారు.. ఈ ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారిచే సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ.. మహిళలు, చిన్నారులు, వృద్ధులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ అన్బురాజన్ వార్నింగ్‌ ఇచ్చారు.

Updated On 30 Dec 2023 9:37 AM IST
cknews1122

cknews1122

Next Story