రైలు పట్టాలపై గొడవ, రైలు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం.. హైదరాబాద్ : వారిద్దరూ ఫ్రెండ్స్. మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు.. ఈ క్రమంలోనే నిన్న సాయం త్రం వారి మధ్య మళ్లీ వివా దం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే క్రమంలో రైలు దూసు కొచ్చింది.. దీంతో ట్రైన్ ఢికొని.. వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ …

రైలు పట్టాలపై గొడవ, రైలు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం..
హైదరాబాద్ : వారిద్దరూ ఫ్రెండ్స్. మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు..
ఈ క్రమంలోనే నిన్న సాయం త్రం వారి మధ్య మళ్లీ వివా దం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే క్రమంలో రైలు దూసు కొచ్చింది.. దీంతో ట్రైన్ ఢికొని.. వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు.
ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయం లో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. వివరాలు సేకరించారు.
రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
