మా ఇష్టంతోనే వచ్చాం..!
ఎవరి బలవంతం లేదన్న మున్సిపల్ కౌన్సిలర్లు
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం లోల్లి
వై.ఎం తాండా వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ లొల్లి
ఇరువర్గాల ఘర్షణ – లాఠీచార్జి
కొత్తూరుకు చేరుకున్న హుజూరాబాద్ ఎమ్మేల్యే పాడి కౌశిక్
దుబ్బాక నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీకి చైర్మన్‌గా ఉన్న బీఆర్‌ఎస్ నేత రాజేశ్వర రావుపై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొన్నగంటి మల్లయ్య వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది.
జమ్మికుంట మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా ఇరువురికి 15 చొప్పున సమబలాలు ఉన్నాయి. వారిలో ఒక వర్గం కౌన్సిలర్లను షాద్ నగర్ నియోజక వర్గం కొత్తూరు శివారులోని ఫామ్ హౌజ్‌లో విడిది చేశారు.
కొత్తూరు మండలం వైఎం తండా శివారులోని ఓ ఫామ్ హౌజ్‌లో కాంగ్రెస్ వర్గానికి చెందిన కౌన్సిలర్లను దాచి ఉంచారని సమాచారం అందడంతో.. వారిని తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు అక్కడికి వచ్చారు.
దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌజ్ వద్దకు చేరుకుని వాదులాటకు దిగారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య బాహబాహీ చోటుచేసుకుని ఘర్షణ పడ్డారు. పొలీసులు రంగ ప్రవేశం చేశారు.
ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ వ్యవహారంలో ఇక్కడ విడిది చేసిన కౌన్సిలర్లు మాత్రం తమ ఇష్టా పూర్వకంగా వచ్చాం ఎవరి బలవంతం లేదని చెప్పడంతో సీన్ క్లైమాక్స్ కు చేరుకుంది.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడడానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొత్తూరు చేరుకున్నారు..