షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం.. ck news హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొలుత మాల్ ముందు భాగంలో మంటలు అంటుకుని అనంతరం మాల్ అంతటికీ శరవేగంగా వ్యాపించినట్టు తెలుస్తోంది.ఈ ప్రమాద సమయంలో షాపింగ్ మాల్లో ఎంత మంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియలేదు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అగ్ని మాపక …

షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం..
ck news
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
తొలుత మాల్ ముందు భాగంలో మంటలు అంటుకుని అనంతరం మాల్ అంతటికీ శరవేగంగా వ్యాపించినట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాద సమయంలో షాపింగ్ మాల్లో ఎంత మంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియలేదు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
ఉప్పల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్చలు ప్రారంభించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు తెలిసే అవకాశముంది.
