అన్నా, వదిన .. మా అబ్బాయి పెళ్ళికి రండి…! షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి అన్న జగన్‌కు ఆహ్వాన పత్రిక అందజేత సోదరుడు, సీఎం జగన్‌తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్‌ నివాసానికి వెళ్లిన షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు… అన్న జగన్‌ను, వదిన వైఎస్ భారతిని కుటుంబ సమేతంగా కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియకు ఫిబ్రవరి 17న వివాహం …

అన్నా, వదిన .. మా అబ్బాయి పెళ్ళికి రండి…!

షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి అన్న జగన్‌కు ఆహ్వాన పత్రిక అందజేత

సోదరుడు, సీఎం జగన్‌తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్‌ నివాసానికి వెళ్లిన షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు…

అన్న జగన్‌ను, వదిన వైఎస్ భారతిని కుటుంబ సమేతంగా కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియకు ఫిబ్రవరి 17న వివాహం ఫిక్స్ అయిందని కుటుంబ సమేతంగా హాజరుకావాలని జగన్‌ను వైఎస్ షర్మిల ఆహ్వానించారు.

అలాగే ఈ నెల 18న జరిగే ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి సైతం రావాలని షర్మిల కోరారు.

అంతకుముందు వైఎస్ షర్మిల స్పెషల్ ఫ్లైటులో కడప నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి వాహనంలో తాడేపల్లికి వెళ్లారు. అనంతరం సీఎం జగన్‌ను కలిశారు.

కాగా చాలా రోజులుగా సోదరుడు వైఎస్ జగన్‌ను షర్మిల కలవలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో కూడా విడివిడిగా పాల్గొన్నారు.

తెలంగాణలో వైఎస్సార్‌టీపీ స్థాపించినప్పటి నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో షర్మిల భేటీ కావడం ఇది తొలిసారి.

Updated On 3 Jan 2024 9:25 PM IST
cknews1122

cknews1122

Next Story