న్యూ ఇయర్ పార్టీలో 7వ తరగతి విద్యార్థులు..
నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాధంతో నడుస్తున్న దేశంలో రోజు రోజు విష సంస్కృతి పెరిగిపోతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా మందుకు బానిసలవుతున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో అందరిని ఆశ్చర్యానకి గురి చేస్తుంది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఫుల్ గా మధ్యం సేవించి ఊగుతు తూగుతూ ఎంజాయ్ చేశారు. ఇంతకు అది ఎక్కడంటే.. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా చోడవరంలోని బాలుర వసతి గృహంలో 7వ తరగతి …
![న్యూ ఇయర్ పార్టీలో 7వ తరగతి విద్యార్థులు.. న్యూ ఇయర్ పార్టీలో 7వ తరగతి విద్యార్థులు..](https://cknewstv.in/wp-content/uploads/2024/01/images-2-1.jpeg)
నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాధంతో నడుస్తున్న దేశంలో రోజు రోజు విష సంస్కృతి పెరిగిపోతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా మందుకు బానిసలవుతున్నారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో అందరిని ఆశ్చర్యానకి గురి చేస్తుంది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఫుల్ గా మధ్యం సేవించి ఊగుతు తూగుతూ ఎంజాయ్ చేశారు. ఇంతకు అది ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా చోడవరంలోని బాలుర వసతి గృహంలో 7వ తరగతి విద్యార్థులు న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు.
మరి పార్టీ అంటే ఉట్టి కేక్ కట్ చేసుకొని బూంది, మిక్షర్, కూల్ డ్రింక్ తాగితే కిక్ ఏం ఉంటుంది అనుకున్నారో ఏమో మరి వీటన్నిటితో పాటు కాసింత మందు, బీర్లు కూడా తెచ్చుకొని మధ్యపానంలో మునిగి తేలారు.
ఇదేంటని అడిగితే నువ్వు వీడియో కట్ చేయ్యి అన్న అంటూ స్వీట్ అయిన వాయిస్ తో ఘటు వ్యాఖ్యలు చేశారు.
వీడియో తీసే అతను ఎంత చెప్పిన వీడియో ఆపట్లేదని అంతా కలిసి అతని పై దాడి కూడా చేశారట. మరి హస్టల్లో ఇంత తతంగం నడుస్తుంటే వార్డెన్ ఏం చేస్తుందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీని పై విద్యాశాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)