ఖమ్మం డిసిసిబి చైర్మన్ రేసులో తుళ్లూరి బ్రహ్మయ్య ..? ఎలగొండ స్వామి?
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జనవరి 03,
ఖమ్మం జిల్లా డిసిసిబి బ్యాంకు ఛైర్మన్ రేసు లో తుళ్లూరి బ్రహ్మయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. డిసిసిబి చైర్మన్ గా ప్రస్తుతం కొనసాగుతున్న కురాకుల నాగభూషణం పై అవిశ్వాసానికి సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. కురాకుల నాగభూషణం రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అనుకూలంగా ఉన్నారని అభియోగం తో అ పదవి నుంచి కురాకుల ను తప్పించేందుకు సమీకరణ ను అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు పూనుకున్నారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలలో మంచి మెజారిటీ సాధించి జిల్లా కు మూడు మంత్రి పదవులు లభించడంతో జిల్లాలో కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది.
ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ డిసిసిబి చైర్మన్ పదవి పై అవిశ్వాసానికి సిద్ధం మవుతుంది. ఈ నేపథ్యంలో డిసిసిబి చైర్మన్ పదవి కోసం బ్రహ్మయ్య, ఖమ్మం కు చెందిన ఎలగొండ స్వామి ఇరువురు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు.
హోరా హోరీగా తలపడుతున్న చైర్మన్ పదవి ఎవరికి దక్కేనో వేచి చూడాలి మరి. ఇరువురి లో బ్రహ్మయ్య రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కాగా, స్వామి రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు అనుచరులు గా కొన సాగుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లో కీలకంగా ఉన్న మంత్రి పొంగులేటి ప్రధాన అనుచరుడు గా ఉన్న బ్రహ్మయ్య కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.