ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ట్రాఫిక్ సీఐ కొడుకు ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చర్చి గాగిల్లపూర్‌లో నివాసం ఉంటున్న ట్రాఫిక్ సిఐ మాత్యుస్ కొషేకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురుకు ఇదివరకే పెళ్లి అయింది. కాగా కుమారుడు జియో మాత్యుస్(38)కు పెళ్లి కాలేదు. కొడుకు ప్రవర్తన సరిగా లేకపోవడంతో గత కొంత కాలంగా …

ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ట్రాఫిక్ సీఐ కొడుకు

ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. చర్చి గాగిల్లపూర్‌లో నివాసం ఉంటున్న ట్రాఫిక్ సిఐ మాత్యుస్ కొషేకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

కూతురుకు ఇదివరకే పెళ్లి అయింది. కాగా కుమారుడు జియో మాత్యుస్(38)కు పెళ్లి కాలేదు. కొడుకు ప్రవర్తన సరిగా లేకపోవడంతో గత కొంత కాలంగా తండ్రి కొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

గురువారం తెల్లవారుజామున ఫ్యాన్ కు ఉరివేసుకోవడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీస్‌లకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్‌లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి నట్లు తెలిసింది.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వై రామకృష్ణ తెలిపారు. మరణానికి మానసిక ఒత్తిడి కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుని తండ్రి గతంలో జీడిమెట్ల ట్రాఫిక్ సీఐగా పనిచేశారు.

Updated On 5 Jan 2024 5:18 AM IST
cknews1122

cknews1122

Next Story