బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గవిభేదాలు.. మాజీమంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో గ్రూప్ విభేదాలు బయటపడ్డాయి. మాజీమంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగా, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు.దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలనుపార్టీ పెద్దలు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. గత 3 రోజులుగా తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో …

బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గవిభేదాలు.. మాజీమంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో గ్రూప్ విభేదాలు బయటపడ్డాయి. మాజీమంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగా, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు.
దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలనుపార్టీ పెద్దలు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

గత 3 రోజులుగా తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ సన్నాహక సమావేశం జరిగింది.

నియోజకవర్గానికి చెందిన కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీమంత్రి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇవాళ్టి సమావేశంలో తగాదాలు మరోసారి బయటపడ్డాయి.

మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ అందుకున్నారు. ఇంతలో పైలట్ రోహిత్ రెడ్డి వర్గం అభ్యంతరం తెలిపింది. మహేందర్ రెడ్డి వ్యవహరించిన తీరు కారణంగానే తాండూరులో బీఆర్ఎస్ ఓటమి పాలైందని, మహేందర్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వరాదన్న అభిప్రాయాన్ని రోహిత్ రెడ్డి వర్గం వ్యక్తం చేసింది.

మహేందర్ రెడ్డి వర్గం కూడా అదే స్థాయిలో ఎదురు సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకున్నారు.

ఇరువర్గాలను ఆయన సముదాయించారు. దాంతో వాగ్వాదానికి తెరపడింది.
తాండూరు నియోజకవర్గంలో నేతల మధ్య గ్రూపు తగాదాలు మూడు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. టికెట్ల విషయంలోనూ తీవ్ర పోటీ నడిచింది.

ఎమ్మెల్యే టికెట్ నాకే దక్కుతుందని చివరి వరకు మాజీమంత్రి మహేందర్ రెడ్డి ఆశించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కానీ, చివరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రాధాన్యం ఇవ్వడంతో అక్కడ పైలట్ రోహిత్ రెడ్డికే మళ్లీ అవకాశం దక్కింది.

అయితే, ఎన్నికల సందర్భంగా మహేందర్ రెడ్డి వర్గం మొత్తం పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతివ్వలేదని ఒక అభిప్రాయం పైలట్ రోహిత్ రెడ్డి వర్గంలో ఉంది.

ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సీనియర్ మంత్రి హరీశ్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

Updated On 6 Jan 2024 10:27 AM IST
cknews1122

cknews1122

Next Story