114 కేజీ ల ఎండు గంజాయి స్వాధీనం
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జనవరి 07,
ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్( ఎన్ఫోర్స్మెంట్) గణేష్ ఆదేశాలతో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ( ఎన్ఫోర్స్మెంట్) తిరుపతి సూచనలతో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వర్ తన సిబ్బంది తో
భద్రాచలం లోని ఎక్సైజ్ చెకపోస్ట్ గోదావరి బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేయగా ఐచర్ వ్యాన్ లో ఖాళీ ట్రే మధ్యలో 114. కేజీ ల ఎండు గంజాయి ని చింతూరు( ఆంధ్ర ప్రదేశ్) నుండి ఔరాంగబాద్ (మహా రాష్ట్ర ) కు రవాణా చేస్తూన్న విజయ్ సందు గైక్వాడ్ ను అదుపులోకి తీసుకొన్నారు.
అధికారులు అతనిని విచారించగ నాసిక్ కి చెందిన మహావీర్ అశోక్ మలు కి చెందిన గంజాయి ని ఔరంగబాద్ కి రవాణా చేస్తున్నాను అని తెలిపినాడు. అధికారులు వీరిద్దరిపై కేసు నమోదు చేసి గంజాయి ని ,ఐచర్ వ్యాన్, 12000 నగదు ను, మొబైల్ ను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పట్టు కున్న గంజాయి విలువ 35 లక్షలు ఉంటుందని అసిస్టెంట్ కమీషనర్ గణేష్ తెలిపారు
ఇట్టి దాడులలో ఎస్సై ముబుషర్ అహమ్మద్
హెడ్ కానిస్టేబుల్స్: కరీం, బాలు కానిస్టేబుల్స్: సుదీర్ ,హరీష్ ,వెంకటేష్, హన్మాంతరావు, విజయ్ లు పాల్గొన్నారు.