వైన్ షాప్ లలో జోరుగా కల్తీ మద్యం విక్రయాలు?
వేములవాడ మండల కేంద్రంలో కల్తీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లుతెలుస్తుంది.
నిత్యం వేలాది మంది భక్తులు రాజన్న దేవస్థానం కి వస్తు ఉంటారు ఇదే అదునుగా చూసిన వైన్స్ షాప్ యజమానులు మద్యాన్ని కల్తీ చేసి సొమ్ము చేసు కుంటున్నారని ప్రజలు వాపోతున్నారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఈరోజు షాపుల ముందు పెద్ద గందర గోళమే చేశారు
వేములవాడ మండల కేంద్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖాధికారులు విఫలం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని వైన్‌షాపుల నుంచి గట్టిగానే ముడుపులు ముడుతున్నా యని పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు
అత్యధికంగా అమ్ముడు పోయే బ్రాండ్లలో చీప్‌లిక్కర్ కలుపుతున్నారని, కొన్ని వైన్స్‌ల్లో నీళ్లు కలిపిన మద్యం విక్రయాలు జరుపుతున్నారని సమాచారం. ఉదయం 10 గంటలకు ముందు, రాత్రి 10 గంటల తర్వాత మద్యం కల్తీ చేస్తున్నారని తెలుస్తు న్నది.
మద్యం సీసాల పైన సీళ్లు ఉండగానే చాకచాక్యంగా మూతలు తొలగించి అందులో కొంత మద్యాన్ని తీసి దానిని మరో సీసాలో పోస్తున్నారని, వాటిల్లో చీప్‌లిక్కర్ కలిపి మళ్లీ యథావిధిగా షాపుల్లో పెట్టి మద్యం ప్రియులకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
కల్తీ మద్యం ద్వారా ఆయా షాపుల యజమానులు రోజుకు 20 నుంచి 30 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
కల్తీ మద్యం వల్ల మద్యం ప్రియులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. ఎసిడిటీ, కాళ్లు, చేతులు విపరీతంగా లాగడం వంటి అనారోగ్య సమస్యల బారినపడు తున్నారని స్థానికులు చెబుతున్నారు.
కల్తీ మద్యం అమ్మకాలపై ప్రత్యేకించి తనిఖీలు చేయకపోవడంతో మద్యం ప్రియుల ఆరోగ్యం గుల్ల అవుతున్నది. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి కల్తీ మద్యం అమ్మకాలను నివారించి, కల్తీకి పాల్పడుతున్న వైన్‌షాపుల లైసెన్సులను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.