మేడారం జాతరకు దీటుగా ముస్తాబవుతున్న బెల్ట్ షాపులు
మేడారం జాతరకు దీటుగా ముస్తాబవుతున్న బెల్ట్ షాపులు "జాతీయ జాబితాలో చేరెందుకు చేరువలో ఉన్న వనదేవతలైన సమ్మక్క,సారలమ్మ, జాతర.!" "మేడారం చేరే" జాతీయ రహదారులపై, రోడ్డుకి ఇరువైపులా వెలుస్తున్న బెల్ట్ షాపుల సంగతేంటి.?" "వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, కన్నయిగుడెం, తాడ్వాయి, పస్ర,గోవిందరావుపేట, ములుగు" "మండలాలలో బెల్ట్ షాపులలో దర్శనమిస్తూ చలామణి అవుతున్న మద్యం ఏ వైన్స్ ప్రోత్సాహంతో నడుస్తున్నాయి" "ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్" తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుంభమేళగా పేరుగాంచిన వనదేవతలైన …

మేడారం జాతరకు దీటుగా ముస్తాబవుతున్న బెల్ట్ షాపులు
"జాతీయ జాబితాలో చేరెందుకు చేరువలో ఉన్న వనదేవతలైన సమ్మక్క,సారలమ్మ, జాతర.!"
"మేడారం చేరే" జాతీయ రహదారులపై, రోడ్డుకి ఇరువైపులా వెలుస్తున్న బెల్ట్ షాపుల సంగతేంటి.?"
"వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, కన్నయిగుడెం, తాడ్వాయి, పస్ర,గోవిందరావుపేట, ములుగు"
"మండలాలలో బెల్ట్ షాపులలో దర్శనమిస్తూ చలామణి అవుతున్న మద్యం ఏ వైన్స్ ప్రోత్సాహంతో నడుస్తున్నాయి"
"ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్"
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుంభమేళగా పేరుగాంచిన వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు.
అన్న విషయం మనందరికీ తెలిసిందే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు తెలంగాణ రాష్ట్రానికి అతిధులుగా భావించి భక్తుల వసతికి, భక్తుల బాగోగులును, పరివేక్షించాల్సిన ప్రభుత్వం జాతర సమయంలో జరుగుతున్న ఆకస్మిక రహదారుల యాక్సిడెంట్లలో ఎందుకు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతున్న జాతర పనులలో ప్రభుత్వం ఎందుకు విప్లమవుతుంది.
దర్శన ప్రయాణంలో ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఏంటి.? విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా జాతీయ మార్గాలలో చలామణి అవుతున్న మధ్యమే" కారణమా.? తెలంగాణ అంటే తినడం, తాగడం, జల్సా చేయడమే" అన్న, అపోహకు తెలంగాణ ప్రభుత్వం కొమ్ముకాస్తుందా;
భక్తి శ్రద్దలతో హృదయ శుద్ధితో చేయవలసిన పూజా కార్యక్రమాలు కాస్త, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వనదేవతలు అంటే మందు, ముక్క, అన్నట్టుగా ప్రవర్తించే తీరును మార్చాలి అంటూ హిందూ దేవాలయ సంఘాలు మీడియా ముఖంగా పలుమార్లు వ్యాఖ్యానించినప్పటికీ. ఇతర మతాలవారు హేళన చేసే విధంగా కాకుండా ఈసారైనా మేడారం జాతరలో అక్రమ వ్యాపారాలు జరగకుండా సక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో కదిలి వస్తున్న భక్తులలో మహిళలను గుర్తించి.
భక్తుల భక్తిశ్రద్ధలకు భంగం కలిగించకుండా జాతరను ఏర్పాటు చేయాలంటూ. గిరిజన సంఘాలు వాపోతున్న పరిస్థితులు ములుగు జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి.
జాతర పేరు చెప్పుకొని మద్యం సిండికేట్ చేసే దందాకు బ్రేకులు వేయాలంటూ మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మేడారం జాతర పనులను ప్రారంభిస్తున్నామని.
వేల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నామని. ప్రభుత్వాలు కమిటీ వేసుకొని ప్రచారం చేసుకోవడం కాదు. మేడారం జాతర సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కోల్పోయే ప్రతి ప్రాణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ, మానవ హక్కుల సంఘాలు పలికే వాతావరణం ములుగు జిల్లా వ్యాప్తంగా నెలకొంది.
