ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు త్వరలోనే గైడ్‌లైన్స్!
హౌసింగ్‌లో డిప్యూటేషన్‌పై 450 మంది ఆఫీసర్లు
కసరత్తు చేస్తున్న హౌసింగ్ అధికారులు
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్స్‌పై స్టడీ
ఈ నెలాఖరు కల్లా గైడ్‌లైన్స్ అందజేసే అవకాశం..
ck news
హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌పై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. ఈ పథకం గైడ్‌లైన్స్‌ను రూపొందించే పనిలో హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈనెలాఖరు కల్లా గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వానికి అందచేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్స్‌పై అధికారులు స్టడీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఎంతో కీలకమైంది. 100 శాతం సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్‌ల విషయంలో గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అధికార పార్టీ కార్యకర్తలకు, ఇండ్లు ఉన్నోళ్లకు, ఎమ్మెల్యేల అనుచరులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్ లబ్ధిదారుల లిస్టులో చోటు దక్కిందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
గత అనుభవాల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇండ్లు లేని పేదలను గుర్తించి, ఎలాంటి అవకతవకలు జరగకుండా స్కీమ్‌ను అమలు చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.
డిప్యూటేషన్‌పై వెళ్లినోళ్లు తిరిగి హౌసింగ్‌కు!
హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సుమారు 450 మంది అధికారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలితో పాటు ఇతర శాఖల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వీరందరిని హౌసింగ్ శాఖకు తీసుకురావాలని, డిప్యూటేషన్లు క్యాన్సిల్ చేయాలని ఇటీవల ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అధికారుల అసోసియేషన్ విన్నవించింది.
అందరూ డిపార్ట్‌మెంట్‌కు వస్తే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయెచ్చని మంత్రికి వివరించింది.ఆ ప్రతిపాదనను సీఎంకు మంత్రి వివరించగా.. సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్ మెంట్‌లో కేవలం 60 మంది అధికారులు, ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరితో పాటు మరికొంత మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్టు మేనేజర్లుగా పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో సుమారు 600 మందిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ప్రత్యేక శాఖగా హౌసింగ్
హౌసింగ్‌ను ప్రత్యేక డిపార్ట్‌మెంట్‌గా మార్చాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్ మెంట్‌ను ఆర్ అండ్ బీలో విలీనం చేసింది.
కేవలం విలీనం చేస్తున్నట్లు జీవో ఇచ్చి.. ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. విలీనానికి ఎన్నో ఆస్తులు, అప్పులు, కోర్టు వివాదాలు అడ్డంకిగా ఉన్నాయని రిటైర్డ్ హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లలేదని అంటున్నారు.
భారీగా అప్లికేషన్లు..
ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు రాష్ర్టవ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని క్షుణ్నంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది.
గ్రామాల్లో ఇండ్లు లేని వాళ్లు, సొంత జాగా ఉండి ఇండ్లు లేని వాళ్లు.. ఇలా అర్హులను సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు, గృహలక్ష్మి స్కీమ్ కు అప్లై చేసుకున్న వాళ్లను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.