దళిత బంధు ఇవ్వాల్సిందే.. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన లబ్ధిదారులు
“ప్రభుత్వాలు వెలిసేది ప్రజల కోసమా, లేక పాలన ప్రదర్శన కోసమా.!”
“మంగపేట మండలం రమణక్కపేటలో మొదలైన దళితుల గోడు”
“నేడు జిల్లాకు చేరెను, దళితుల కడుపులు నింపడానికి లేని బడ్జెట్”
“నూతన పాలకుల పథకాలకు ఎలా.? వచ్చెను”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట, గ్రామంలో మంగ. పవన్ అనే వ్యక్తినీ, దళిత బంధు కి అర్హుడుగా ప్రభుత్వ సర్వేలో ఎంపికై, దళిత బంధుకి అర్హుడిగా నిర్ధారించిన ప్రభుత్వం, మరి కొద్ది రోజుల్లో దళిత బంధు పథకం మీ ఇంట వరిస్తుంది అంటూ, దళిత బంధు బ్యాంక్ పాస్ బుక్ చేతికి అందించింది,
ప్రభుత్వ మారడంతో దళితుల కలలంతా కాలగమనంలో కలిసిపోయాయి. ఇదే విషయమై నూతన పాలనపై ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతున్నది. అధికారంలోకి వచ్చి నెలరోజుల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
తాజాగా గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని (దళిత బంధు) కొనసాగిస్తూ నిధులను విడుదలని లబ్ధిదారులు కోరుతున్నారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్లో ఉన్న వాటర్ ట్యాంక్‌ను ఎక్కి దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు.
మంత్రి సీతక్క, కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. దళితులు ఆర్థికంగా ఎదిగే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం దళితులను ఉద్దేశించి ప్రవేశపెట్టిన పథకానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.