గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... గద్వాల్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జిల్లాలోని జమ్మిచేడు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. …

గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

గద్వాల్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

జిల్లాలోని జమ్మిచేడు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం లో మరణించిన వారిని నరేష్(23), పవన్ కుమార్(28), ఆంజనేయు లు(50)లుగా పోలీసులు గుర్తించారు.

గద్వాలలో పుట్టినరోజు వేడుకలకు హాజరై గద్వాల్ నుంచి వెర్రవెల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated On 20 Jan 2024 9:25 AM IST
cknews1122

cknews1122

Next Story