చిన్నారులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనవరి 20, తల్లాడ సీకే న్యూస్ ప్రతినిధి విజయ్
మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన దాసరి నరసింహారావు, స్వాతి దంపతుల కుమార్తె రిత్విక ఓనీల అలంకరణ వేడుక, కుమారుడు సాయి పంచ కట్టు వేడుక శనివారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నారుగూడెం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెళ్ళ మల్లికార్జున్ రావు, తుమ్మలపల్లి రమేష్, యల్లంకి వెంకటేశ్వరరావు హాజరై ఆ చిన్నారులకు అక్షింతలు వేసి దీవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకర రోశయ్య, గుమ్మా వలరాజు, గొడ్ల రవి తదితరులు ఉన్నారు.