రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది టెన్త్‌ ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. ఆర్‌ఆర్‌బీ రీజియన్లు.అహ్మదాబాద్, …

రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది

టెన్త్‌ ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు.
అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌ పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.

అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) 5,696 పోస్టులు

కేటగీరీ వారీ పోస్టులు : యూఆర్‌- 2499; ఎస్సీ- 804; ఎస్టీ- 482; ఓబీసీ- 1351; ఈడబ్ల్యూఎస్‌- 560; ఎక్స్‌ఎస్‌ఎం- 572.

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీ ఖాళీలు.

  1. అహ్మదాబాద్- 238
  2. అజ్‌మేర్- 228
  3. బెంగళూరు- 473
  4. భోపాల్- 284
  5. భువనేశ్వర్- 280
  6. బిలాస్‌పూర్- 1,316
  7. చండీఘడ్‌- 66
  8. చెన్నై- 148
  9. గువాహటి- 62
  10. జమ్ము అండ్‌ శ్రీనగర్-39
  11. కోల్‌కతా- 345
  12. మాల్దా- 217
  13. ముంబయి- 547
  14. ముజఫర్‌పూర్- 38
  15. పట్నా- 38
  16. ప్రయాగ్‌రాజ్- 286
  17. రాంచీ- 153
  18. సికింద్రాబాద్- 758
  19. సిలిగురి- 67
  20. తిరువనంతపురం-70
  21. గోరఖ్‌పూర్- 43
    అర్హత.
    అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ ఫిట్టర్‌ ఎలక్ట్రీషియన్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ మిల్‌రైట్‌ మెయింటెనెన్స్‌ మెకానిక్‌ మెకానిక్‌- రేడియో అండ్‌ టీవీ ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌ మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌ వైర్‌మ్యాన్‌ ట్రాక్టర్‌ మెకానిక్‌ ఆర్మేటర్‌ అండ్‌ కాయిల్‌ వైండర్‌ మెకానిక్‌ డీజిల్‌ హీట్‌ ఇంజిన్‌ టర్నర్‌ మెషినిస్ట్‌ రిఫ్రజెరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ మెకానిక్‌ పూర్తి చేసి ఉండాలి లేదా మెకానికల్‌ ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే.
    వయోపరిమితి

    01-07-2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. పే స్కేల్
    నెలకు రూ.19900- రూ.63200. దరఖాస్తు ఫీజు.

ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక ప్రక్రియ.

ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రశ్నపత్రం వివరాలు.

సీబీటీ-1కు 60 నిమిషాల సమయం ఉంటుంది 75 ప్రశ్నలు 75 మార్కులు కేటాయించారు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది మ్యాథ్స్‌ మెంటల్‌ ఎబిలిటీ జనరల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లోప్రశ్నలు వస్తాయి. సీబీటీ-2లో రెండు విభాగాలు ఉంటాయి

పార్ట్‌-ఏ విభాగానికి 90 నిమిషాల వ్యవధి 100 ప్రశ్నలు పార్ట్‌-బి విభాగానికి 60 నిమిషాల వ్యవధి 75 ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పార్ట్‌-ఏలో మ్యాథ్స్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌; పార్ట్‌-బిలో సంబంధిత ట్రేడ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్య తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 20-01-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 19-02-2024.

దరఖాస్తులో మార్పులకు అవకాశం. 20-02-2024 నుంచి 29-02-2024 వరకు.

Updated On 21 Jan 2024 9:52 PM IST
cknews1122

cknews1122

Next Story